Jalamandali Stp: హైదరాబాద్ మహానగరం పరిధిలో... సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని... జలమండలి ఎండీ దాన కిషోర్ ఆదేశించారు. నగరంలో వందకు వందశాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా... 3 వేల 800కోట్ల రూపాయలతో 31 కొత్త ఎస్టీపీల నిర్మాణాన్ని జలమండలి చేపట్టింది. ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో.. అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో దాన కిషోర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఎస్టీపీల నిర్మాణ పురోగతిపై విడివిడిగా చర్చించారు. అక్టోబరు నాటికి ఎస్టీపీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని... ఈ మేరకు పనులను వేగవంతం చేయాలని దాన కిషోర్ తెలిపారు. ప్రతి ఎస్టీపీ ప్రాంగణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: ప్రైవేటు ట్యూషన్లు చెప్పే ప్రభుత్వ టీచర్లకు హైకోర్టు షాక్