బీసీ గణన చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల లెక్కలు తేల్చాలంటూ హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
1931లో ఆంగ్లేయుల కాలంలో చేపట్టిన సర్వే ప్రామాణికంగా బీసీలకు రిజర్వేషన్లు, నిధులు కేటాయిస్తున్నారన్నారు. చట్టసభల్లో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర పద్దులో కేవలం రూ. రెండు వేల కోట్లు కేటాయించారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
బీసీ గణన చేపట్టాలనే డిమాండ్‌తో దిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఇవీచూడండి: ఓయూ విద్యార్థి ఆత్మహత్య.. వీహెచ్ సహా విద్యార్థుల అరెస్ట్