అసెంబ్లీ ముట్టడికి జగిత్యాల చెరకు రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ముత్యంపేట చక్కెర పరిశ్రమను తెరిపించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. రైతులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని... ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ విస్మరించారని రైతులు ఆరోపించారు. వెంటనే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'ఫోన్‌కాల్‌తో వ్యవసాయ యంత్రాలు సమకూరేలా పథకం'