ETV Bharat / state

BRS MLA Reacts on IT Raids : 'ఎమ్మెల్యేలు వ్యాపారం చేయొద్దని రాజ్యాంగంలో ఉందా..?' - ఐటీ దాడులపై మర్రి జనార్దన్‌రెడ్డి స్పందన

IT raids at BRS MLAs house On Second Day : రాష్ట్రంలో రెండోరోజు ఐటీ శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌ రెడ్డి, పైళ్ల శేఖర్‌ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. వారి వ్యాపార లావాదేవీలను ఐటీ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఐటీ అధికారుల సోదాలకు పూర్తిగా సహకరిస్తున్నానని తెలిపిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.. వ్యాపారం చేయొద్దని రాజ్యాంగంలో ఉందా అని ప్రశ్నించారు.

Marri Janardhan Reddy
Marri Janardhan Reddy
author img

By

Published : Jun 15, 2023, 12:35 PM IST

IT Raids Continues Second Day in BRS MLAs house : రాష్ట్రంలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సుమారు 70బృందాలతో... స్థిరాస్తి, హోటల్స్ వ్యాపారంలో భాగస్వామ్యం కలిగిన వారి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి ఇళ్లలో... రెండోరోజు ఆదాయపన్ను శాఖ సోదాలు చేస్తున్నారు. జూబ్సీహిల్స్‌లోని మర్రి జనార్దన్‌రెడ్డి ఇంటి వద్దకు వెళ్లిన ఐటీ అధికారులు... ఆదాయపన్ను చెల్లింపు, వ్యయాలపత్రాలను పరిశీలిస్తున్నారు. అమీర్‌పేట్‌లోని జేసీ బ్రదర్స్ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. గడిచిన రెండు ఆర్ధిక సంవత్సరాల... వ్యాపార, ఆర్ధిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. స్ధిరాస్తి, హోటల్స్ వ్యాపారాల్లో... భాగస్వామ్యం అనుబంధ వ్యాపారాలు, బినామీలు, డైరెక్టర్లు, మేనేజింగ్‌ డైరెక్టర్లు, సీఈవో ఇళ్లలోను సోదాలు చేస్తున్నారు.

BRS MLA Marri Janardhan Reddy Reacts on IT Raids : ఐటీ దాడులపై స్పందించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి... బుధవారం నుంచి తనిఖీలు చేస్తున్నారని వెల్లడించారు. ఐటీ అధికారుల సోదాలకు పూర్తిగా సహకరిస్తున్నట్లు వివరించిన ఆయన... ఎమ్మెల్యేలు వ్యాపారం చేయొద్దని రాజ్యాంగంలో ఉందా అని ప్రశ్నించారు. వ్యాపారానికి తగినంత పన్ను చెల్లిస్తున్నట్లు పునరుద్ఘాటించారు. సకాలంలో పన్ను చెల్లించాలని గతంలో ఐటీశాఖ అధికారులే అవార్డు ఇచ్చారన్న ఎమ్మెల్యే... ప్రస్తుతం అదేరీతిలో క్లీన్‌ చీట్‌ ఇచ్చి వెళ్తారని వెల్లడించారు.

'ఐటీ అధికారులు నా ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. నిన్నటి నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు వ్యాపారం చేయొద్దని రాజ్యాంగంలో ఉందా ? వ్యాపారానికి తగిన పన్ను సక్రమంగా చెల్లిస్తున్నా. ఇప్పటివరకు దాదాపు రూ. 200 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించి ఉంటా. పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి భూములు కొని విక్రయించా. కక్ష సాధింపు దాడులేంటి అనేది నేను తర్వాత చెప్తాను. మా సిబ్బందిపై ఐటీ అధికారులు దురుసుగా ప్రవర్తించారు. ఐటీ అధికారుల హోదాలకు సంబంధించి నేను పూర్తిగా వివరాలు ఇస్తాను.'-మర్రి జనార్దన్‌ రెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే

మాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఊరుకోబోం : సోదాలు ఎప్పుడు ముగుస్తాయో చెప్పలేమని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. సహనాన్ని పరీక్షించేలా ఐటీ అధికారుల సోదాలు ఉన్నాయన్న ఆయన... అడిగిన అన్ని వివరాలు అందిస్తున్నామన్నారు. తమ సంస్థల ఉద్యోగుల పట్ల అధికారులు దురుసుగా ప్రవర్తించారని తెలుస్తోందన్నారు. అలాంటి పద్దతి మంచిది కాదన్న మర్రి జనార్దన్‌రెడ్డి... మాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఊరుకోబోమన్నారు. కొన్నిచోట్ల తనిఖీలు ఐటీ శాఖ అధికారుల తనిఖీలు ఇవాళ ముగిసే అవకాశం ఉందని సమాచారం.

ఇవీ చదవండి :

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.