ETV Bharat / state

KTR BIRTHDAY: ప్రజలకు అందుబాటులో ఉండండి.. అదే నాకు ఇచ్చే బహుమతి

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జన్మదిన వేడుకలకు ఎవరూ హైదరాబాద్ రావద్దని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​... పార్టీ శ్రేణులు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ పిలుపు మేరకు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.

KTR BIRTHDAY:
కేటీఆర్ పుట్టినరోజు
author img

By

Published : Jul 23, 2021, 9:41 PM IST

Updated : Jul 24, 2021, 4:40 AM IST

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు.. కేటీఆర్ 45వ జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా జరిపేందుకు తెరాస శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరూ రావద్దని.. కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున.. తెరాస శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

తాను ఎవరిని కలవడం లేదని... ఈ విషయంలో తప్పుగా భావించవద్దని పార్టీ శ్రేణులను కోరారు. తన జన్మదినం సందర్బంగా ముక్కోటి వృక్షార్చనలో పాల్గొనాలని.. లేదా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో పాల్గొనాలని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సూచించారు. "గిఫ్ట్ ఏ స్మైల్" (GIFT A SMILE) కార్యక్రమంలో భాగంగా వికలాంగులకు ఇవ్వనున్న ద్విచక్రవాహనాల కార్యక్రమం.. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత నిర్వహిస్తారని మంత్రి కేటీఆర్‌ కార్యాలయం తెలిపింది. కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తన వంతుగా 50 ద్విచక్రవాహనాలను విరాళంగా అందించనున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు 105 మంది దివ్యాంగులకు వాహనాలు అందిస్తున్నట్లు వెల్లడించారు.

మరోవైపు కేటీఆర్ జన్మదిన వేడుకలను నిరాడంబరంగా నిర్వహించేందుకు... రాష్ట్ర వ్యాప్తంగా తెరాస శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించవద్దని.. వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు సాయం చేయాలని కోరారు. అలాగే స్థానికంగానే ఉండి... మొక్కలు నాటాలని.. వీలైతే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తమకు తోచిన సాయం చేయాలని కేటీఆర్ సూచించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద... ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను వర్షాలు తగ్గిన తర్వాత ప్రత్యేక కార్యక్రమం ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించారు. రాజ్యసభ సభ్యుడు సంతోశ్​కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు కోట్ల మొక్కలు నాటేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సన్నాహాలు చేసింది. తెరాస నేతలు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం, రక్తదానం, కేక్ కటింగ్ నిర్వహించనున్నారు. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే గాదరి కిషోర్ డాక్యుమెంటరీని.. శంభీపూర్ రాజు ప్రత్యేక పాటను రూపొందించారు.

KTR birthday song: అదరగొట్టిన 'జయహో కేటీఆర్'​ సాంగ్​.!

కేటీఆర్​ జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ నగరంలో ఆ పార్టీ శ్రేణులు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేపట్టారు. ముక్కోటి వృక్షార్చనలో భాగంగా కేటీఆర్ అభిమాని.. రాజనాల శ్రీహరి ఐదు వందల మొక్కలను ఓరుగల్లు వాసులకు అందజేశారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే.. నన్నపనేని నరేందర్ తనదైన శైలిలో కేటీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఖిల్లా వరంగల్ మట్టికోట సమీపంలోని మైదానంలో వంద అడుగుల హరిత ఆర్ట్ రూపంలో కేటీఆర్ చిత్రపటాన్ని వేసి తన అభిమానాన్ని చాటి చెప్పారు.

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తలపెట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రముఖ సినీ నటి రమ్యకృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.

వర్షాల దృష్ట్యా పుట్టినరోజు వేడుకలు నిర్వహించవద్దని.. మంత్రి కేటీఆర్ తెరాస శ్రేణులకు సూచించినా... పలువురు మాత్రం తమకు నచ్చిన విధంగా కేటీఆర్​పై అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఇదీ చూడండి: KTR: 'భారీ వర్షాలున్నాయి.. ప్రతి ఉద్యోగి అందుబాటులో ఉండాలి'

Last Updated : Jul 24, 2021, 4:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.