హైదరాబాద్ హెచ్ఐసీసీలో హైసియా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఐటీ సంస్థల వల్ల హైదరాబాద్ పశ్చిమ భాగంలో ఒత్తిడి పెరిగిందని చెప్పారు. నగరం చుట్టూ సరికొత్త ఐటీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఐటీ అభివృద్ధి కోసం గ్రిడ్ పాలసీని అవలంభిస్తున్నామని ప్రకటించారు.
నగరానికి ఇతర దిక్కుల్లో కార్యాలయాల ఏర్పాటుకు ఐటీ సంస్థలు ముందుకు రావాలని కోరారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. రెండో శ్రేణి నగరాల్లోనూ ఐటీ టవర్లు ఏర్పాటు చేస్తూన్నామన్నారు. సైబర్ నేరాలు తగ్గించడంలో సైబరాబాద్ పోలీసుల కృషి చాలా బాగుందని ప్రశంసించారు.
ఇదీ చదవండి: ధరణిని సమర్థంగా, పారదర్శకంగా నిర్వహించాలి: సీఎస్