రానున్న నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్ అండ్ మాన్యుఫాక్చరింగ్ రంగంలో... 3 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని... పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ రాయదుర్గంలో ఇంటెల్ ఇండియా డిజైన్ అండ్ ఇంజినీరింగ్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. బెంగళూరు తర్వాత తమ కేంద్రాన్ని...హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడంపై ఇంటెల్‌కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. హార్డ్‌వేర్ రంగంలో నూతన ఆవిష్కరణకర్తల కోసం... ఏప్రిల్‌లో టీ-వర్క్స్ ప్రారంభమవుతుందని కేటీఆర్ ప్రకటించారు. యానిమేషన్, గేమింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లోనూ హైదరాబాద్... బెంగళూరుకు దీటుగా అభివృద్ధి చెందుతోందని మంత్రిపేర్కొన్నారు.
ఇవీ చూడండి...సేవా మార్గం వైపు నడిపించిన మహనీయుడు సత్యసాయి బాబా..