ఇస్టా కాంగ్రెస్ - 2019 ఘనంగా ప్రారంభం
రైతు ఆదాయం రెట్టింపు చేయటమే లక్ష్యం
వ్యవసాయ సంక్షోభం నుంచి గట్టెక్కించే క్రమం 2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో మోదీ సర్కారు కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి అన్నారు. వ్యవసాయంలో విత్తనం బాగుంటేనే మంచి నాణ్యమైన అధిక దిగుబడులతో పంట చేతికొస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో తెలంగాణ విత్తన రంగం అభివృద్ధి చెందుతోందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. భారతదేశ విత్తన రంగంలో తెలంగాణది పెద్దన్న పాత్ర అని పేర్కొన్నారు.
స్టాళ్లు పరిశీలించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు
బహుళ జాతి, జాతీయ ప్రైవేటు, ప్రభుత్వ కంపెనీల ఆధ్వర్యంలో 30 పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. ప్రైవేటు సంస్థలతోపాటు ఇక్రిశాట్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో ప్రధాన ఆహార పంట వరి, మొక్కజొన్న, జొన్న, మిరప, పత్తి, పప్పుధాన్యాలు, వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు స్టాళ్లు కొలువుదీరాయి. ఆయా స్టాళ్ల ప్రత్యేకత తెలుసుకుంటూ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు కలియ తిరిగి పరిశీలించారు.
నాణ్యమైన విత్తనోత్పత్తిపై సదస్సు
ఇవాళ ఇస్టా సదస్సులో విత్తనోత్పత్తి రైతు సదస్సు జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి 1600 మంది రైతులు హారజరయ్యే ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల వ్యవసాయ శాఖల మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కురసాల కన్నబాబు, హాజరుకానున్నారు. నాణ్యమైన విత్తనోత్పత్తిలో రైతులకు అవగాహన కల్పించనున్నారు.
ఇవీ చూడండి: సచివాలయం, అసెంబ్లీ భవనాలకు భూమి పూజ