ETV Bharat / state

శాసనసభ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ - గవర్నర్ నరసింహన్

ఈనెల 18, 19 తేదీల్లో అసెంబ్లీ, మండలి సమావేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. శాసనసభ, మండలి కార్యదర్శి నరసింహాచార్యులు నోటిఫికేషన్​ను జారీ చేశారు.

నోటిఫికేషన్ జారీ
author img

By

Published : Jul 12, 2019, 9:26 PM IST

Updated : Jul 12, 2019, 10:43 PM IST

నూతన పురపాలక చట్టం ఆమోదం కోసం శాసనసభ ప్రత్యేక సమావేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. గవర్నర్ నరసింహన్ తరపున శాసనసభ, మండలి కార్యదర్శి నరసింహాచార్యులు ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 18న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, 19న మధ్యాహ్నం రెండు గంటలకు మండలి సమావేశమవుతాయి. కొత్త పురపాలక చట్టం బిల్లును 18న శాసనసభలో ప్రవేశపెడతారు. 19న అసెంబ్లీలో బిల్లుపై చర్చ, ఆమోదం ఉంటుంది. తర్వాత 19న మధ్యాహ్నం మండలి సమావేశమవుతుంది. అసెంబ్లీ ఆమోదించిన పురపాలక చట్టం బిల్లుపై పెద్దల సభలో చర్చించి ఆమోదం తెలుపుతారు. కేవలం నూతన పురపాలక చట్టంపై చర్చ, ఆమోదానికి మాత్రమే ఈ సమావేశాలను పరిమితం చేస్తారు.

శాసనసభ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ

ఇవీ చూడండి: ఎంపీటీసీని చంపడం హేయమైన చర్య: ఎస్పీ

Last Updated : Jul 12, 2019, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.