ETV Bharat / state

ఇరిగేషన్​లో అక్రమాలు.. సీసీఎస్​లో ఫిర్యాదు

ఇరిగేషన్ శాఖలో జరిగిన అక్రమాలపై ఆ శాఖ ఉపకార్యదర్శి సుబ్బయ్య.. హైదరాబాద్ సీసీఎస్​లో ఫిర్యాదు చేశారు. 8 లక్షలు స్వాహా చేసేందుకు పథకం రచించి... నకిలీ జీవోలు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సీసీఎస్​
author img

By

Published : Sep 27, 2019, 8:47 PM IST

సాగునీటి శాఖలో అక్రమాలు.. సీసీఎస్​లో ఫిర్యాదు

ఇరిగేషన్ శాఖలో నకిలీ జీవోలు సృష్టించి లక్షలు స్వాహా చేసినట్లు ఆ శాఖ ఉప కార్యదర్శి హైదరాబాద్​ సీసీఎస్​లో ఫిర్యాదు చేశారు. 88 లక్షలు మంజూరు అయినట్లు.. అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారన్నారు. ఆర్థిక శాఖ అనుమతి తీసుకొని ఖజానా నుంచి నగదు బదిలీ చేసుకున్నారని తెలిపారు. సాగునీటి శాఖ ఉన్నతాధికారులు జీవోలను పరిశీలిస్తున్న క్రమంలో ఈ వ్యవహారం వెలుగు చూసిందని పేర్కొన్నారు. అంతర్గతంగా విచారించగా... గుర్తు తెలియని వ్యక్తులు ఈ నేరానికి పాల్పడ్డారని తెలుసుకున్నారు. వారిని గుర్తించి చర్యలు చేపట్టాలని సీసీఎస్ పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: పిల్ల తిమింగలం వలలో పడితే తల్లి ఏం చేసిందో చూడండి..

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.