ETV Bharat / state

'గోల్నాక శ్మశాన వాటికలో అక్రమంగా దోచుకుంటున్నారు' - hyderabad latest news

హైదరాబాద్ లోని గోల్నాక శ్మశాన వాటికలో వర్కర్లు, దళారులు దోచుకుంటున్నారని డివిజన్ కార్పొరేటర్ ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయించిన మెత్తం కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులపై సమీక్షించి గ్రేవ్ యార్డ్ ఇంఛార్జీ వద్దకు తీసుకెళ్లారు.

golnaka cemetary
'గోల్నాక శ్మశాన వాటికలో అక్రమంగా దోచుకుంటున్నారు'
author img

By

Published : May 26, 2021, 9:08 AM IST

హైదరాబాద్​లోని గోల్నాక డివిజన్​లోని హిందూ శ్మశాన వాటికలో ఆఫీసు వర్కర్లు, దళారులు అందినకాడికి దోచుకుంటున్నారని గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. గోల్నాకలోని శ్మశాన వాటిక వద్ద పరిస్థితులను సమీక్షించారు. సిబ్బంది చేతివాటం, దళారుల అడ్డగోలు వసూళ్లను గ్రేవ్ యార్డ్ ఇంఛార్జీ దృష్టికి తీసుకెళ్లారు.

సాక్ష్యాలతో…

శ్మశాన వాటికలో ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం కంటే అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు కార్పొరేటర్ తెలిపారు. కరోనా కష్టకాలంలో ఇంట్లో మనిషిని కోల్పోయి దుఃఖంలో ఉన్న వారితో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని బాధితులు తమకు చెప్పారని అన్నారు. డొనేషన్ కింద రూ.2800 నుంచి రూ.3500 వరకు తీసుకుంటున్నారని ఆరోపించారు.

అయితే ఈ విషయంపై స్పందించిన ఇంఛార్జ్ కుమార్… అలాంటి అక్రమాలు తన దృష్టికి రాలేదని చెప్పారు. వెంటనే కార్పొరేటర్ ఇద్దరు వ్యక్తుల నుంచి ఆధారాలతో సహా బయట పెట్టి… డబ్బులు అధికంగా వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు, కమిటీ సభ్యులపై ఉందని తెలిపారు.

ఇదీ చూడండి: ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్​పై నేడు విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.