ఆలయాల దాడుల అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ అన్నారు. సీఎస్ ఆదిత్యనాథ్ థాస్తో పాటు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన దాడులకు సంబంధించి కీలక అంశాలను వెల్లడించారు. కృష్ణా, రాజమండ్రిలో జరిగిన ఘటనలు ఒకే ఎలక్ట్రిక్ రంపం వినియోగించినట్లు ఆధారాలున్నాయని చెప్పారు.
రాష్ట్రంలో దేవాలయాలపై మొత్తం 388 దాడులు జరిగాయి. ఇందులో విగ్రహల ధ్వంసం పరంగా చూస్తే.. 2019లో - 6 , 2020లో -29, 2021లో 3 నమోదయ్యాయి. ఈ ఘటనలన్నింటీపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. సెప్టెంబర్ 5 తరువాత జరిగిన ఘటన కేసులకు సంబంధించిన వివరాలన్నింటినీ సేకరిస్తున్నాం. సరైన సాక్ష్యాధారాలతో నిందితులను పట్టుకుంటాం - రవిశంకర్ అయ్యన్నార్ , శాంతిభద్రతల ఏడీజీ
మతమార్పిడి ఘటనలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని శాంతిభద్రత ఏడీజీ అన్నారు. సీఎం, డీజీపీ, హోం మంత్రి... క్రైస్తవుల కంటే ముందు ప్రజా సేవకులన్నారు.వారికి అలాంటి వాటిని ఆపాదించటం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేంద్రం వైఖరేంటి: కేటీఆర్