Notices to IPS Naveen Kumar Son in House Controversy Case : జూబ్లీహిల్స్‌లో ఉండే మాజీ ఐఏఎస్ భన్వర్ లాల్ ఇంటిని కొన్ని సంవత్సరాల క్రితం ఐపీఎస్ నవీన్ కుమార్ సోదరుడు అద్దెకు తీసుకున్నారు. తర్వాత తన ఇంటిని కజ్జాకు ప్రయత్నం చేశాడని పోలీసులకు మాజీ ఐఏఎస్ అధికారి ఫిర్యాదు చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి గత నెలలో ఐపీఎస్ నవీన్ కుమార్‌కు నోటీసులు జారీ చేసి విచారించారు. తాజాగా ఇవాళ నవీన్ కుమార్ కుమారుడు సాహిత్ భట్‌కు జూబ్లీహిల్స్ పోలీసులు 41 సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని కోరారు. ఇదే కేసులో గత నెల 23న సాంబశివరావు, డింపుల్ దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
అసలేం జరిగిందంటే? 2014లో అప్పటికీ విధి నిర్వహణలోనే ఉన్న భన్వర్‌లాల్ తనకు ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్‌లో ఉండేవారు. దాంతో జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లోని ఆయన సొంతింటిని నవీన్ కుమార్ సోదరుడు సాంబశివరావుకు అద్దెకు ఇచ్చారు. సివిల్ సర్వీసెస్ సహచరుడు అని నమ్మకంతో ఐదేళ్లు 2019 వరకు లీజ్ అగ్రిమెంట్ చేశారు. తర్వాత నవీన్ కుమార్ అదే ఇంటిలో కింద పోర్షన్‌లో నివాసం ఉంటున్నాడు. భన్వర్‌లాల్ పదవీ విరమణ చేసిన తర్వాత సొంతింట్లో ఉండేందుకు వీరిని ఇంటిని ఖాళీ చేయాలని కోరడంతో సాంబశివరావు కాస్త గడువు కోరడంతో నమ్మి అతనికి సమయం ఇచ్చాడు.
IAS రోహిణి సింధూరి వర్సెస్ IPS రూప.. 'సోషల్ వార్'పై హోంమంత్రి సీరియస్
కానీ ఫలితం లేకుండా పోయింది. అద్దె బకాయిలు చెల్లించేందుకు 2020 సెప్టెంబర్ 18న సాంబశివరావు పోస్ట్ డేటెడ్ చెక్కులను ఇచ్చాడు. వాటిలో కొన్ని బౌన్స్ కావడంతో భన్వర్‌లాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఇంటి మరమ్మతులకు రూ.11 లక్షల 30 వేలు, ఇతర చెల్లింపులు రూ.38 లక్షలు చేశామని 2020 సెప్టెంబర్‌లోనే సాంబశివరావు లీగల్ నోటీసులు పంపించారు. ఇళ్లు ఖాళీ చేయకపోగా, లీజ్ అగ్రిమెంట్ 20 ఏళ్లు పెంచాలని కోర్టును ఆశ్రయించారు.
భన్వర్‌లాల్ భార్య మణిలాల్ ఫోర్జరీ సంతకాలను చూపిస్తూ, నవీన్ కుమార్ సహా బంధువులు తమను మోసగిస్తున్నారని భన్వర్‌లాల్ భార్య మణిలాల్ ఫిర్యాదు చేశారు. కాగా సీసీఎస్ పోలీసులు నిందింతులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇంటి అద్దె ఎగ్గొట్టి, ఇంటిని సొంతం చేసుకునేందుకే అలా చేశారని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. తాజాగా విచారణలో భాగంగా నవీన్ కుమార్ కుమారుడు సాహిత్‌భట్, భన్వర్‌లాల్ భార్యను దూషించాడని అతనికి నోటీసులు అందజేశారు. శనివారం ఉదయం 10 గంటలకు తమ ఎదుట విచారణకు హాజరవ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులు ఆదేశించారు.
పనిష్మెంట్ ఇచ్చినా డోంట్ కేర్.. రోహిణి, రూప మధ్య ఆగని 'కోల్డ్ వార్'!