ఐదో తరగతి ప్రవేశ ప్రక్రియ ఎప్పుడు, ఎలా నిర్వహించాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇంటర్, డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. ఇప్పుడు కాలేజీ, సీటు మాత్రమే కేటాయిస్తామని.. తరగతులు ఇప్పట్లో మొదలు కావని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మేరకే రాష్ట్రంలో గురుకులాలు ప్రారంభవుతాయని చెప్పారు.
ఆన్ లైన్ తరగతులు పూర్తిస్థాయి ప్రత్యామ్నాయం కాకపోయినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో వీడియో తరగతులు, టీశాట్ ద్వారా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గురుకుల విద్య యథాతథంగా కొనసాగుతుందని.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన పడవద్దంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చదవండి: 59 చైనా యాప్‌లపై నిషేధం