ETV Bharat / state

Minister Jagadish reddy on new farm laws: 'విద్యుత్​ చట్టాలను కూడా ఉపసంహరించుకోవాలి'

వ్యవసాయచట్టాల(repeal of new farm laws) మాదిరిగానే కేంద్రం తెచ్చిన విద్యుత్‌ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి(Minister Jagadish reddy on new farm laws) డిమాండ్‌ చేశారు. సాగుచట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం.. భారత దేశ రైతుల విజయంగా పేర్కొన్నారు. అదే విధంగా ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిస్తే.. అందుకనుగుణంగా రైతులను తాము సన్నద్ధం చేస్తామని తెలిపారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు తాత్కాలిక ప్రకటన కాకుండా.. శాశ్వతంగా రద్దు చేయాలంటున్న జగదీశ్‌రెడ్డి(Minister Jagadish reddy on new farm laws)తో 'ఈటీవీ భారత్'​ ప్రతినిధి ముఖాముఖి.

minister jagadish reddy
మంత్రి జగదీశ్​ రెడ్డి
author img

By

Published : Nov 19, 2021, 12:55 PM IST

ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత నివ్వాలి: జగదీశ్​ రెడ్డి

నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందన ఏంటి.?

నూతన వ్యవసాయ చట్టాల(repeal of new farm laws) రద్దు.. భారత రైతుల విజయం. ఏడాది కాలంగా దిల్లీలో పోరాటం చేస్తున్న, ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల విజయం. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా నిన్న తెరాస ఆధ్వర్యంలో చేపట్టిన మహా ధర్నాలో సీఎం కేసీఆర్​ ఇచ్చిన అల్టిమేటం ఫలితం ఇది. సాగు చట్టాలను(Minister Jagadish reddy on new farm laws) కేంద్రం తాత్కాలికంగా కాదు.. శాశ్వతంగా ఉపసంహరించుకోవాలి.

కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్​ చేస్తూ.. నిన్న తెరాస ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. కేంద్రం నుంచి ఏం డిమాండ్​ చేస్తున్నారు.?

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అడుగుతున్నాం. కొంటారా.. కొనరా అని ప్రశ్నిస్తున్నాం. ధాన్యం కొనడానికి కేంద్రానికి ఉన్న సమస్యలు ఏంటో చెప్పాలి.? సంవత్సరానికి ఏ రకం వడ్లు ఎన్ని కొంటారో చెబితే.. అందుకు అనుగుణంగా మేము రైతుల(Minister Jagadish reddy on new farm laws)ను సన్నద్ధం చేసుకుంటాం. ఏడాదికి తగిన ప్రణాళిక ముందే ఇవ్వమని చెబుతున్నాం. కేంద్రం బహిరంగంగా చెబితే ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. రైతులను అందుకు అనుగుణంగా పంటలు వేసేలా సిద్ధం చేస్తాం. దేశ ఆహార అవసరాలు, నిల్వలు ఎన్ని పెట్టుకోవాలి.. వాటిపై కేంద్రానికి స్పష్టత ఉండాలి. అదే విషయాన్ని నిన్న మహాధర్నాలో కేసీఆర్​.. కేంద్రానికి సూచించారు. రాష్ట్ర భాజపా నాయకులు అనవసరంగా ఇక్కడ గందరగోళం సృష్టిస్తున్నారు.

యాసంగిలో బాయిల్డ్​ రైస్​ కొనేది లేదని కేంద్రం చెబుతోంది. దీనిపై మీరు ఏం చెప్పదలుచుకున్నారు.?

యాసంగిలో బాయిల్డ్​ రైస్(Minister Jagadish reddy on new farm laws) కొనబోమనే విషయాన్ని.. కేంద్రాన్ని మరింత స్పష్టంగా, సూటిగా అడుగుతున్నాం. ఏ రకం వడ్లు ఎన్ని కొంటారో కేంద్రం చెప్పాలి. ఖరీఫ్, యాసంగి​లో ధాన్యం ఎంత కొంటారో చెబితే అందుకు అనుగుణంగా రైతులను మేము సన్నద్ధం చేసుకుంటాం. మేము అడుగుతున్న దానిలో ఎలాంటి రాజకీయాలు లేవు.

గతంలో విద్యుత్​ చట్టాలను రద్దు చేయాలని మీరు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు కేంద్రం సాగు చట్టాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యుత్​ చట్టాల విషయంలో మీ అభిప్రాయం ఏంటి.?

వ్యవసాయ చట్టాల(repeal of new farm laws) మాదిరిగానే విద్యుత్​ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలి. క్రాస్‌ సబ్సిడీ(Minister Jagadish reddy on new farm laws)లకు నష్టం జరగకుండా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. సీఎం కేసీఆర్​ రైతులకు 24గంటల ఉచిత విద్యుత్​ అందిస్తున్నారు. విద్యుత్​ చట్టాల మూలంగా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీకి, రైతులకు నష్టం వాటిల్లే ఆస్కారం ఉంది.

ఇవీ చదవండి: కొత్త సాగు చట్టాల రద్దు.. రైతులకు మోదీ క్షమాపణలు

Farm laws India: సాగు చట్టాల రద్దు.. వ్యూహాత్మకమా? వెనక్కి తగ్గడమా?

KTR tweet today: పదవుల్లో ఉన్నవారి కంటే ప్రజల అధికారం గొప్పది: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.