ETV Bharat / state

కోడి మాంసం, గుడ్లు తినడం ఎంతవరకు సురక్షితం?! - బర్డ్ ఫ్లూ తాజా వార్తలు

బర్డ్​ఫ్లూ కొత్తేం కాదు.. కొన్నేళ్లుగా చూస్తునే ఉన్నాం... కోళ్ల ఫాం సురక్షితంగా ఉంచుకుంటే వైరస్​ సోకదు. సాధారణంగా చైనా, కజికిస్థాన్ వంటి దేశాల నుంచి​ వలస పక్షులు వచ్చిన ప్రతిసారీ దేశంలో బర్డ్​ఫ్లూ వస్తుందని అంతర్జాతీయ గుడ్డు కమిషన్​ ఛైర్మన్​, శ్రీనివాసా ఫామ్స్​ మేనేజింగ్​ డైరక్టర్​ చిట్టూరి సురేశ్​ రాయుడు అన్నారు.

interview with  International Egg Commission Chairman  Chitturi Suresh talk about Bird Flu
కోడి మాంసం, గుడ్లు తినడం ఎంతవరకు సురక్షితం?!
author img

By

Published : Jan 7, 2021, 5:36 PM IST

కోడి మాంసం, గుడ్లు తినడం ఎంతవరకు సురక్షితం?!

భారత్​లో కోళ్లకు టీకాలు వేయడానికి అనుమతి లేనందున కోళ్ల ఫారాల వద్దకు వలస పక్షులు రాకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు బయోసెక్యూరిటీ చర్యలు ఒక్కటే అద్భుతమైన మంత్రమని అంతర్జాతీయ గుడ్డు కమిషన్​ ఛైర్మన్​, శ్రీనివాసా ఫామ్స్​ మేనేజింగ్​ డైరక్టర్​ చిట్టూరి సురేశ్​ రాయుడు తెలిపారు.

ఫామ్​ల వద్ద రైతులు విధిగా మాస్క్​లు ధరించడం, లోపలకు వెళ్లేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోవడం, శానిటైజ్​ చేసుకోవడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. చైనా, వియత్నాం వంటి దేశాల్లో కోళ్లతో పాటు... పందులు, ఇతర జంతువులను కూడా పెంచుతున్న దృష్ట్యా ఆ ఆయా దేశాల్లో సులభంగా వైరస్​ వ్యాప్తికి అవకాశాలు అధికంగా ఉంటాయని తెలిపారు. కోడిమాంసం, గుడ్డు పూర్తి సురక్షితమని వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొవిడ్​ 19 నేపథ్యంలో మనిషిలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే... ఎగ్​, చికెన్​ నిరభ్యంతరంగా తినాల్సిందేనంటున్న సురేశ్​తో... ఈటీవీ భారత్​ ముఖాముఖి.

  • కొవిడ్ నేపథ్యంలో బర్డ్​ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. దేశంలోని కోళ్లల్లో బర్డ్‌ఫ్ల్యూ తొలి కేసు ఎక్కడ నమోదైంది...?

కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణా రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయింది. నేను పూర్తి నివేదికలు చూడాల్సి ఉంది. మధ్యప్రదేశ్​లోని భోపాల్​ ఐసీఏఆర్​- నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ హై సెక్యూరిటీ ఎనిమల్ డీసీసెస్​- ఎన్​ఐహెచ్​ఎస్​ఏడీ నిర్ధారించిందా... లేదా అనేది తెలుసుకోవాలి. దురదృష్టవశాత్తూ దేశవ్యాప్తంగా ఈ ఒక్కటే ప్రయోగశాల ఉంది. రాష్ట్రానికి ఒక్క ప్రయోగశాల నైనా పెట్టాలి. పదిహేనుళ్లుగా అడుగుతున్నాం... కేంద్రం హామీ ఇస్తుంది. కానీ, కార్యరూపంలో పెట్టడం లేదు. ఇలాంటి వైరస్ తీవ్రత సమయాల్లో పరీక్షలు త్వరగా చేయాల్సి ఉంటుంది. ఆ వైరస్ ఏ ఫామ్‌లో వచ్చిందో తెలుసుకుని ఆ కోళ్లన్నీ చంపేసి జాగ్రత్తగా పూడ్చేసినట్లైతే మరింత ప్రబలకుండా ఉంటుంది. కానీ, ఆ వ్యవస్థ లేదు. కోళ్లని చంపి పూడ్చేస్తే ఆ నష్ట పరిహారం రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు చెల్లించాలి. అయితే... అది అంత సులువైన పని కాదు. ఎందుకంటే తన ఫామ్‌లో బర్డ్‌ఫ్లూ వచ్చిందని రైతు ఫిర్యాదు చేయడు. అదే సమయంలో ప్రభుత్వం కూడా చెప్పదు. ఆ చుట్టు పక్కల మాత్రం కోళ్లల్లో మరణాలు అధికంగా సంభవించడం వల్ల పెద్ద ఎత్తున నష్టం ఉంటుంది. దీనివల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదు. కోళ్ల నుంచి వైరస్ మనుషులకు సోకదు. ఇది శాస్త్రీయంగా రుజువైంది.

  • తొలుత వలస పక్షులు, బాతులు, కాకుల్లో ఈ వైరస్ కనిపిస్తుందంటున్నారు. కేరళ, హిమాచల్​ ప్రదేశ్​, కర్ణాటక రాష్ట్రాల్లో బర్డ్​ఫ్లూ బయటపడిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా ఆనవాళ్లు కనిపిస్తున్నాయా...?

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్​ఫ్లూ కేసులు నమోదైనట్లు నాకు సమాచారం రాలేదు. ప్రభుత్వం, పశుసంవర్థక శాఖ పరీక్షించాలి. అసలు మన దగ్గర నుంచి నమూనాలు వెళ్లాయో లేదో అన్న విషయం ఇంకా కనుక్కోవాలి. ఇది చైనా నుంచి వచ్చే వలస పక్షుల ద్వారా సంక్రమించే వైరస్. సాధారణంగా అటవీ ప్రాంతాల్లో ఉండే పక్షులకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. పూర్తి సమాచారం రావాల్సి ఉంది. అసలు బర్డ్‌ఫ్లూ అన్నది నిజమా కాదా అన్నది కూడా నాకు సందేహంగా ఉంది. భోపాల్‌ ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ నుంచి అధికారికంగా సమాచారం వస్తే తప్ప ఏం చెప్పలేని పరిస్థితి.

  • కరోనా మరిచిపోక ముందే మళ్లీ బర్డ్​ఫ్లూ అనేది భయాందోళన గురిచేస్తోంది. దేశంలో కోడి మాంసం, గుడ్డు అనేది పెద్ద మార్కెట్​. పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపుతోందని భావిస్తున్నారు.

సామాజిక మాధ్యమాల్లో వ్యాపింపజేసే అంశాలు నిజమని నమ్మి వినియోగదారులు చికెన్​, ఎగ్​ తినడం మానేస్తే అది పరిశ్రమవాసులకు పెద్దదెబ్బే అవుతుంది. అదీ కాక ఇది మొదటి సారేం కాదు. 2004,2005లో కూడా అంతా చూశాం. జనాల్ని భయపెడుతునే ఉన్నారు. ఇప్పటికీ ఏం కాలేదు. ఈ వ్యాధితో ఏం సంబంధం లేదు. కోడి మాంసం, గుడ్డు తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. తినకపోతేనే తిరుగు ప్రమాదం ఉన్నట్లు లెక్క. రోగనిరోధక శక్తి విషయంలో రాజీ పడ్డట్లే అవుతుంది. కొవిడ్ నేపథ్యంలో చికెన్​, ఎగ్​ తినడం వల్ల కరోనా బారినపడ్డా కూడా చాలా మంది తొందరగా కోలుకోవడం మనం చూశాం. 99శాతం మంది బయటపడ్డారు. నిరోధక శక్తి బాగుంటే.. ఆరోగ్యం బాగుంటుంది. అది ప్రయోజనం. అందుకోసం కోడి, గుడ్లు తినడం తప్పనిసరి. ఇది నా విజ్ఞప్తి.

  • 2006లో కోళ్లల్లో బర్డ్‌ప్లూ చూశాం. ఆ సమయంలో కూడా పౌల్ట్రీ పరిశ్రమకు అపారనష్టం వాటిల్లింది. 2019లో కొవిడ్ మహమ్మారి వల్ల నష్టం వాటిల్లింది. మళ్లీ అలాంటి సంక్షోభం దారితీసే ప్రమాదం ఉందంటారా...?

రెండు మూడు రోజులుగా వస్తున్న వార్తల నేపథ్యంలో వినియోగంలో మాత్రం పెద్దగా తగ్గినట్లు చూడటం లేదు. నా ఆశ కూడా తేడా రాదనే ఉంది. ఇవన్నీ వదంతులే... నిజం కాదని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. మీ లాంటి వాళ్లు మద్దతు ఇచ్చి అసలు నిజాలు ఏంటి అనేది తెలియజేస్తే బాగుంటుంది. మాపై ప్రభావం చూపకుండా ఉంటుంది. కోడి మాంసం, గుడ్డు శుభ్రంగా కడిగి కారం, మలాసాలు కలిపి ఉడికించిన తర్వాతే తింటాం. కాబట్టి... కొవిడ్ నేపథ్యంలో మాత్రం రోగ నిరోధక శక్తి పెరగాలంటే తప్పనిరిగా ఇవి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే. అదే చక్కటి ఆయుధం.

  • బర్డ్‌ఫ్లూ వదంతుల నేపథ్యంలో పరిశ్రమ పరంగా అప్రమత్తత ఎలా ఉంది. మాంసం, గుడ్డు వినియోగదారుల్లో ఏ విధమైన అవగాహన ఎలా కల్పిస్తున్నారు...?

మీడియా ద్వారా వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తున్నాం. కోడి మాంసం, గుడ్లు తినడం వల్ల ఆరోగ్యపరంగా ఏమీ హాని ఉండదని ప్రకటన జారీ చేసి ఆత్మస్థైర్యం నింపాలని రాష్ట్ర ప్రభుత్వాలు, పశుసంవర్థక శాఖలను కోరాం. తాజాగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని ప్రజలను కోరుతున్నాం. ఏ ప్రమాదం లేదు. కోళ్లకు వస్తే మనకు వస్తుందన్నది సంబంధం లేదు. భయపడాల్సిన పని లేదు. రకరకాల వైరస్‌లు ఉంటాయి... ఈ ఫ్లూకు సంబంధం లేదు. కొవిడ్‌ను ఎదుర్కొంటున్న రోగ నిరోధన శక్తి పెంచుకోవాలంటే తప్పకుండా యానిమల్ ప్రొటీన్ ఆహారంగా తీసుకోవాల్సిందే. జింక్, డీ3 విటమిన్లు, మినరల్స్ అందడం వల్లే శక్తి.

  • కేంద్రం ఆదేశాల నేపథ్యంలో బర్డ్‌ఫ్లూ అప్రమత్తతపై పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సమీక్ష చేశారు. తెలంగాణలో ఆనవాళ్లు లేవన్నారు కదా...?

వాస్తవమే... తెలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు లేవు. పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రభుత్వం, పశుసంవర్థక శాఖ తీసుకుంటున్న చర్యలు, అప్రమత్తతపై స్పందించారు. కోడి మాంసం, గుడ్డు తినడం వల్ల ప్రమాదం లేదని చెప్పారు సంతోషం. బర్డ్‌ఫ్లూ అనేది ఎంతో కాలంగా ఉంది. ఇదేం కొత్త కాదు. సాధారణంగా వలస పక్షులు వచ్చినప్పుడుల్లా వైరస్ వ్యాప్తి చెందడం రివాజుగా మారింది. ఈ నేపథ్యంలో వైరస్ రాకుండా పౌల్ట్రీ పరిశ్రమ కూడా బయో సెక్యూరిటీ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. చాలా మంది రైతులు జాగ్రత్తగా ఉంటారు. వారి ఫామ్‌ల్లో ఫ్లూ సోకే అవకాశం ఉండదు. చుట్టు పక్కల వచ్చినా వారి ఫామ్స్‌లో రాదు. ఎందుకంటే ఆ రైతులు తీసుకునే జాగ్రత్తలే శ్రీరామరక్ష. కరోనా తర్వాత ప్రతి రోజులు 15 సార్లు చేతులు కడుక్కుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇది అంతే. రైతులు బయో సెక్యూరిటీ అంశాన్ని సీరియస్‌గా తీసుకోండి. మీ ఫామ్ ఆరోగ్యంగా ఉంటుంది. అదనపు ఖర్చే కాదు.

  • ఇప్పటికే ముందస్తు నివారణ, అప్రమత్తత కోసం కేంద్రం... ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. ఏమైనా ఫిర్యాదులు వస్తున్నాయా...?

దేశం నలుమూలల నుంచి ఫిర్యాదులు వెళ్తున్నాయి. దిల్లీలో కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ నేతృత్వంలో సమీక్షలు సైతం సాగుతున్నాయి. మా ప్రతినిధులు కూడా ఆ సమావేశానికి హాజరవుతున్నారు. గతంలో లాగా కాకుండా ఇలాంటి అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకుని కార్యాచరణతో ముందుకు వెళ్తే బాగుటుంది. ఇకనైనా ప్రయోగశాలలు, పర్యవేక్షణ పెంచాలి. అందుకోసం పెద్ద బడ్జెట్‌ ఏం వెచ్చించాల్సిన అవసరం లేదు. మొదట హాండిల్ చేస్తే ఒక ఫామ్ అవుతుంది. తర్వాత వెయ్యి పామ్‌లు అవుతాయి. ఈ విషయంలో మనం మెచ్యూరిటీ గ్రో అవ్వాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయంగా కోళ్లల్లో టీకాలు వేస్తున్నారు. కానీ, భారత్‌లో మాత్రం అనుమతి లేదు. బ్యూరోక్రాట్లు వ్యాక్సిన్‌కు అనుమతి ఇవ్వడం లేదు. అదొకటి అనుమతి ఇస్తే ఇలాంటి రాకుండా జాగ్రత్త పడవచ్చు.

  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఏ ఫామ్‌లోనైనా కోళ్లల్లో బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించాయా... ఒకవేళ వైరస్ వస్తే ఎదుర్కోవడానికి ఏ రకంగా పరిశ్రమ సమాయత్తంగా ఉంది...?

మేం నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. శ్రీనివాసా ఫామ్స్ ఉన్న అన్ని చోట్లసహా ఇతర ప్రాంతాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాంటూ అప్రమత్తం చేశాం. మనుషులు, పక్షులు... కోళ్ల ఫామ్‌ల్లోకి రాకుండా చూసుకోవాలి. వచ్చే వ్యక్తులెవరైనా ఉంటే కొన్ని ప్రోటోకాల్స్ పాటించాలి. ఇక వలస పక్షులు ఎట్టి పరిస్థితుల్లోనూ రాకుండా చూసుకోవాల్సిందే. పొరపాటున అవి మేత కోసం వచ్చి ల్యాండ్‌ అయితే మాత్రం అక్కడ్నుంటే ప్రమాదం తెరుచుకున్నట్లు లెక్క. మేమైతే ఎల్లప్పుడూ నిరోధిస్తుంటాం. మందులు, టీకాల వల్లే కాదు. రైతులకు ఎప్పుడు బయో సెక్యూరిటీ అని చెబుతున్నాం. ఫామ్ శుభ్రంగా పెట్టుకుంటే లాభాలు పెరుతాయి. భవిష్యత్తులో కోళ్లల్లో జబ్బులు రావు. కనీసం ఇప్పుడైనా జాగ్రత్తపడతారని ఆశిస్తున్నాం.

ఇదీ చూడండి: బర్డ్ ఫ్లూ కలవరం...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.