Interventional Pulmonology bronchus 2021: హైదరాబాద్ హెచ్ఐసీసీలో యశోద ఆస్పత్రుల ఆధ్వర్యంలో ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ- బ్రాంకస్ 2021 ద్వితీయ వార్షిక సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు. "ది ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ(The future of interventional pulmonology)”అనే థీమ్‌తో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతోంది.
ప్రతి యేటా సదస్సు
అతిపెద్ద పల్మనాలజిస్టుల సమావేశాన్ని నిర్వహించడం పట్ల యశోద ఆస్పత్రుల(Interventional pulmonology bronchus 2021 by Yashoda hospitals) డైరెక్టర్ డా. పవన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. కొవిడ్ విపత్కర సమయాల్లో వైద్యులు చేసిన కృషికి ఇది నివాళి అని పేర్కొన్నారు. డా. పవన్ కుమార్ పల్మనాలజిస్ట్ కావడంతో.. యశోద ఆస్పత్రుల్లో శ్వాసకోశ సమస్యల పరిష్కారానికి అమలు చేస్తున్న కొత్త శిక్షణా పద్ధతులపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అభివృద్ధి ప్రమాణాలపై చర్చించేందుకు ప్రతి సంవత్సరం ఈ సదస్సు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
STEAM: అతిగా ఆవిరి పట్టడం అనర్థం
విధానపరమైన నైపుణ్యాల కోసం
ఈ సదస్సులో వ్యాధి నిర్ధరణ, చికిత్సా విధానంలో కొత్తగా వచ్చిన ఆవిష్కరణలను చర్చించనున్నట్లు చెప్పారు. శిక్షణా కార్యక్రమాల ద్వారా రాబోయే పల్మనాలజిస్టులకు విధానపరమైన నైపుణ్యాలను అందించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో వివిధ దేశాల్లో ఈ రంగంలో వైద్యులు ఎదుర్కొన్న సవాళ్లు, ఆ సవాళ్లను అధిగమించడానికి అవసరమైన పద్ధతులు, రోబోటిక్ బ్రోంకోస్కోపీ, సురక్షిత పద్ధతులు వంటి ఆసక్తికరమైన అంశాలను నేడు చర్చించినట్లు వివరించారు.
వివిధ దేశాల నుంచి దాదాపు 1000 మందికిపైగా పల్మనాలజిస్టులు సదస్సుకు హాజరయ్యారు. ఆసియా వేదికగా జరుగుతున్న తొలి వైద్య సదస్సుగా “బ్రాంకస్- 2021” గుర్తింపు పొందటం గర్వకారణమని యశోద పల్మనాలజీ వైద్య నిపుణులు డాక్టర్ హరికిషన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత వైద్యులు డా. గుస్తావో కంబో నచెలి(అమెరికా), డాక్టర్. మిచెలా బెజ్జి(ఇటలీ), డాక్టర్. మునవ్వర్(యూకే), డాక్టర్ పల్లవ్ షా(యూకే), డాక్టర్. సారాబోర్న్(బంగ్లాదేశ్), డాక్టర్ కైల్ హోగార్త్(అమెరికా), డా. మైఖేల్ ప్రిట్‌చెట్ (అమెరికా) ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Harish rao review on covid: కొవిడ్ కొత్త వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్