ETV Bharat / state

దేశంలో ఎంత మంది ఇంటర్నెట్​ వాడుతున్నారంటే...?

భారతదేశంలో ఇంటర్నెట్​ వినియోగదారుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ప్రపంచంలో అత్యధిక సంఖ్య వాడకందార్లలో చైనా మొదటి స్థానం కాగా... భారత్​ రెండో స్థానంలో ఉంది. మొత్తం వాడకందార్లలో రెండొంతుల మంది ప్రతిరోజు ఇంటర్నెట్​ వాడుతున్నట్లు ఇంటర్నెట్​ అండ్​ మొబైల్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా(ఐఎఎంఏఐ) సర్వేలో తేలింది. 99శాతం మంది మొబైల్​ ద్వారా ఇంటర్నెట్​ వాడుతుండగా, 12 సంవత్సరాలు వయస్సు పైబడిన వాడకందార్లు 38.5 కోట్లుగా వెల్లడించింది.

దేశంలో ఎంత మంది ఇంటర్నెట్​ వాడుతున్నారంటే...?
author img

By

Published : Sep 30, 2019, 9:44 AM IST

దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న విప్లవంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రజల ముంగిటికి వస్తోంది. మొబైల్‌ వాడకందార్లతో పాటు ఇంటర్నెట్‌ వాడకం కూడా దేశంలో అనూహ్యంగా పెరుగుతోంది. తక్కువ ధరలకే స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులోకి రావడం, తక్కువ ధరకే డేటా లభ్యం కావడంతో ఇంటర్నెట్‌ వాడకం శరవేగంగా విస్తరిస్తోంది. పల్లె, పట్టణాలు, నగరాలు అన్న తేడా లేకుండా ఇంటర్నెట్‌ వినియోగం ఏటికేడు పెరిగిపోతోంది.

రెండో స్థానంలో మనదేశం

2019 నాటికి దాదాపు 142 కోట్లు జనాభా ఉన్న చైనా.. 82.90 కోట్లు మంది ఇంటర్నెట్‌ వాడకందార్లతో ప్రపంచంలో మొదటి స్థానం ఉండగా, దాదాపు 136 కోట్లు జనాభా కలిగిన భారత్‌ దేశం 56 కోట్లు మంది ఇంటర్నెట్‌ వినియోగదారులతో రెండో స్థానంలో నిలిచింది. భారత దేశంలో ఇంటర్నెట్‌ వాడకంపై ఇటీవల ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా-ఐఎఎంఏఐ సర్వే నిర్వహించింది. అప్పుడప్పుడు ఇంటర్నెట్‌ వాడుతున్న వారిని కాకుండా రెగ్యులర్‌ వాడకందార్లపై 2019 జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలలపాటు ఆ సంస్థ సర్వే నిర్వహించింది. గడచిన అయిదేళ్లుగా ఇంటర్నెట్‌ వాడుతున్నవారి సంఖ్య 45.10 కోట్లుకాగా 12 సంవత్సరాలు వయస్సు పైబడిన వారు 38.5 కోట్లు, 5 నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు 6.6 కోట్లుగా వెల్లడించింది. 12 సంవత్సరాలు వయస్సు పైబడిన ఇంటర్నెట్‌ వాడకందార్లు దేశ జనాభాలో 36శాతంకాగా అర్బన్‌లో 51శాతం, గ్రామీణంలో 27శాతం ఉన్నారు. దేశంలోని ఎనిమిది మెట్రో నగరాల్లో మొత్తం వినియోగదారుల్లో 63శాతం మంది ఉన్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. మెట్రో నగరాల వారీగా వాడకందార్ల సంఖ్యను పరిశీలించినట్లయితే కోటి 17లక్షల మందితో ముంబయి మొదటి స్థానంలో ఉండగా కోటి 12 లక్షలతో దేశ రాజధాని దిల్లీ రెండో స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో వరుసగా 61లక్షలతో బెంగుళూరు, కోల్​కతాలు, 54లక్షలతో చెన్నై, 42లక్షలతో హైదరాబాద్‌, 39లక్షలతో అహ్మదాబాద్‌, 36లక్షలతో పుణెలు నిలిచాయి.

పురుషులే ఎక్కువ

ఇంటర్నెట్‌ వాడకం దారుల్లో మహిళల కంటే పురుషులు అధికంగా ఉన్నట్లు తేలింది. ఇంటర్నెట్‌ వాడకందారుల్లో దేశంలో సగటున 67శాతం పురుషులు, 33 శాతం స్త్రీలు ఉన్నారు. అయితే అర్బన్‌లో పురుషులు 62శాతం, స్త్రీలు 38శాతం ఉండగా రూరల్‌లో పురుషులు 72శాతం, స్త్రీలు 28శాతం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. యాభైలక్షలు మించి జనాభా కలిగిన మెట్రో నగరాల్లో పురుషులు, స్త్రీలు 60:40గా ఉన్నట్లు తేల్చింది. వయస్సుల వారీగా తీసుకుంటే 12 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారే మొత్తం వాడకం దారుల్లో రెండు భాగాలు ఉన్నట్లు బహర్గతమైంది. మొత్తం వాడకం దారుల్లో 65శాతం మంది ప్రతి రోజు ఇంటర్నెట్‌ వాడుతుండగా 4శాతం మంది వారంలో నాలుగైదు రోజులు, 11 శాతం మంది వారంలో రెండు మూడు రోజులు, 7శాతం మంది వారానికి ఒకసారి, 13శాతం మంది వారానికి ఒకసారి కూడా వాడడం లేదని తేలింది. పట్టణాల్లో 72శాతం, గ్రామీణంలో 57శాతం మంది ప్రతి రోజు ఇంటర్నెట్‌ వాడుతున్నారు. వాడకందారుల్లో పట్టణాల్లో అయినా...గ్రామీణ ప్రాంతాల్లో అయినా కూడా 99శాతం మంది మొబైల్‌ ఫోన్లనే వినియోగిస్తున్నారు. ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌, ట్యాబ్లెట్‌ల ద్వారా నెట్‌ వాడుతున్న వారి సంఖ్య ఒక శాతం కూడా లేనట్లు వెల్లడించింది.

వీకెండ్స్​లో ఎక్కువ:

ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 84నుంచి 86శాతం మంది నాలుగో తరం నెట్‌ వాడుతుండగా మూడో వంతు మంది ప్రతి రోజు గంటకంటే ఎక్కువ సమయం ఇంటర్నెట్‌ వినియోగిస్తున్నారని వెల్లడైంది. వారాంతాల్లో శని, ఆదివారాల్లో అయితే కొంచం ఎక్కువ సమయం ఇంటర్నెట్‌ వాడకం జరుగుతున్నట్లు తేలింది.

ఇదీ చూడండి : రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల పండువగా బతుకమ్మ వేడుకలు

TG_HYD_23_29_AIRPORT HAJ YATRIKULA ANDHOLANA_AV_TS10020.Re.. M.BHUJANGAREDDY. ( RAJENDRANAGAR) 8008840002. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హజ్ టెర్మినల్ వద్ద నల్గొండ మిర్యాలగూడకు చెందిన మక్కా ఉమ్రా యాత్రకు బయలుదేరిన యాత్రికులకు చుక్కెదురు. 2 రోజులుగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో పడిగాపులు. మాలక్ పేట ఆల్ కయూమ్ ట్రావెల్స్ వారి ఆధ్వర్యంలో 17 రోజుల కొరకు ఈ ఉమ్రా యాత్రకు బయలుదేరారు. మిర్యాలగూడ నుండి 42 మంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది ప్రయాణికులు బయలుదేరారు. 27న బయలుదేరి అక్టోబర్ 13న తిరిగి హైదరాబాద్కు చేరుకోవాలి. మొన్న సాయంత్రం 5 గంటల 55 నిమిషాలకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా 965 బోయింగ్ విమానం ఇప్పటివరకు విమానాన్ని ఏర్పాటు చేయలేదు. సాంకేతిక లోపం కారణంగా విమాన సర్వీసులను ఏర్పాటు చేయలేకపోతున్నామని ఎయిర్ ఇండియా సంస్థ వాదన. రెండు రోజులుగా వృద్ధులు మహిళలు పిల్లలు చాలా అవస్థలు పడుతున్నారు. త్వరగా విమానాన్ని ఏర్పాటు చేసి మక్కా ప్రయాణానికి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ఏర్పోర్ట్ లో డిమాండ్ చేస్తున్నారు. ఎయిర్లైన్స్ అధికారుల మాత్రం ఈరోజు పంపించే ఏర్పాటు చేస్తామని అంటున్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.