ETV Bharat / state

అది జరిగినప్పుడే నిజమైన మహిళా దినోత్సవం..!

మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ రోజు మహిళలకు అత్యంత గౌరవం ఇవ్వాలని, మహిళలను గుర్తించాలని ఒక రోజుగా నిర్ణయించినా... వారి అభిరుచులకు తగ్గట్టు ఎదగనిస్తే, వారిపై వేధింపులు లేకుండా బతకనిస్తే చాలు అన్న అభిప్రాయం చాలామంది మహిళల నుంచి వ్యక్తమవుతోంది. సమాజంలో చాలామంది మహిళలు నేటికీ లైంగిక వేధింపులకు గురవుతున్నారు. భరించలేని ఇబ్బంది ఉంటే ప్రాణాలూ తీసుకుంటున్నారు. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయి. అలా కాకుండా మన సమాజంలో మహిళలను గౌరవించి... వారికి సముచిత స్థానం ఇస్తే బాగుంటుంది అన్న భావన ప్రతిఒక్కరిలో ఉంది.

Day
అది జరిగినప్పుడే నిజమైన మహిళా దినోత్సవం..!
author img

By

Published : Mar 8, 2021, 9:02 AM IST

మన నేతలు వేదికలు ఎక్కి మహిళా దినోత్సవం సందర్భంగా... వారి గురించి గొప్పలు చెప్పి అదంతా మరచిపోతారు. మన సొసైటీ అంతే.! ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతూ... పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది. ఆడవారి కష్టానికి గుర్తింపుగా మార్చి 8న ఇంటర్నేషనల్‌‌ ఉమెన్స్‌‌ డే జరుపుకోవటం మంచిదే. కానీ మగవారితో పాటు ఆడవారికీ సమాన ప్రాధాన్యత ఉండాలని చెప్పగలిగితే... అలా సమాజం మారితే ప్రయోజనం ఉంటుంది. మహిళకు సరైన ప్రాధాన్యత ఇచ్చినప్పుడే వేధింపులు లేకుండా, మహిళాభ్యుదయం జరిగినప్పుడే నిజమైన మహిళా దినోత్సవం.

మన సమాజంలో లింగపరమైన వివక్ష ఉందన్నది సత్యం. పుట్టుక నుంచే స్త్రీలు అడుగడుగునా వివక్షను ఎదుర్కొంటున్నారు. 2019లో ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన లింగ అసమానత్వ సూచీలో మన దేశం 112వ స్థానంలో ఉంది. మహిళా ఆరోగ్యంలోనూ అంతే. ఆడశిశువు పట్ల వివక్ష కారణంగా... ప్రపంచం ఏటా సుమారు 10 కోట్ల మంది మహిళలను కోల్పోతుందని 30 ఏళ్ల కిందటే అమర్త్యసేన్ పేర్కొన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్న సమయంలో... తల్లి గర్భంలోనే ఆడశిశువును చంపిన ఉదాహరణలెన్నో..! 2011లో ప్రతి వెయ్యి మంది బాలురకు 833 మంది బాలికలే ఉన్నారు. అప్పుడు ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించగా... 2019లో ఆ నిష్పత్తి 1000:920కి పెరిగింది.

ఈ లోకంలో స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. మనల్ని కంటిపాపలా కాపాడే ‘స్త్రీమూర్తి’ని స్మరించుకోవడం మన అందరి బాధ్యత. తల్లిగా లాలిస్తూ.. చెల్లిగా తోడుంటూ.. భార్యగా బాగోగులు చూస్తూ.. దాసిలా పనిచేస్తూ.. కుటుంబ భారాన్ని మోస్తూ... సర్వం త్యాగం చేస్తుంది మహిళ. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇదే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఆమె’కు చక్కని బహుమతి అందించడమే కాకుండా.. శుభాకాంక్షలు తెలియజేయాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.