హైదరాబాద్ రవీంద్రభారతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. భారతీయ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్, వాసవీ ఫిల్మ్ అవార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను డాక్టర్ కేవీ రమణరావు, లలితరావు కలిసి పురస్కారాలతో సన్మానించారు.
వేడుకలో పాల్గొన్న పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా.. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందన్నారు. ఉదయం నుంచి జరిగిన సాంస్కృతి కార్యక్రమాల్లో.. వేయి మంది కళాకారులు వివిధ నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో దిల్లీ తెరాస ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి, సినీ నటిమణులు పాల్గొన్నారు.