ETV Bharat / state

ఈ నెల 13నుంచి స్వీట్​ అండ్​ కైట్​ ఫెస్టివల్​ - tourism secretary burra venkatesham

ఓ వైపు నోరూరించే స్వీట్లతో పాటు... మరోవైపు అందమైన గాలిపటాలకు హైదరాబాద్​ నగరం వేదిక కానుంది. ఈ నెల 13 నుంచి మూడురోజుల పాటు సికింద్రాబాద్​ పరేడ్​ గ్రౌండ్స్​లో స్వీట్స్​ అండ్​ కైట్​ ఫెస్టివల్​ జరగనుంది.

international kite and sweet festival in hyderabad
ఈ నెల 13నుంచి స్వీట్​ అండ్​ కైట్​ ఫెస్టివల్​
author img

By

Published : Jan 11, 2020, 9:14 PM IST

సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ... రుచికరమైన ఆహారంతోపాటు.. కావాల్సినంత ఆనందాన్ని పంచేలా స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్​ను నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. హరితా ప్లాజాలో స్వీట్స్ అండ్​ కైట్ ఫెస్టివల్ పోస్టర్​ను విడుదల చేశారు. కార్యక్రమంలో పర్యటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం పాల్గొన్నారు. భాగ్యనగరంలో దేశ విదేశాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివాసం ఉంటున్నారని.. వారందరికీ తమ సొంత ఇంట్లోనే పండుగ చేసుకుంటున్న భావన కలిగించేలా ఈ సారి ఫెస్టివల్ ఏర్పాట్లు ఉంటాయన్నారు.

ఈ నెల 13 నుంచి మూడు రోజులపాటు సికింద్రాబాద్​ పరేడ్​ గ్రౌండ్స్​లో జరగనున్న ఈ ఫెస్టివల్​లో సుమారు 15 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల సంప్రదాయ ఆటలు.. కర్రా బిళ్లా, తొక్కుడు బిళ్ల, గోళీల ఆటల వంటివాటిని కూడా ఈ సారి ఇందులో భాగం చేస్తుండటం విశేషం. కైట్ ఫెస్టివల్​కి వచ్చే వారు గుడ్డ సంచీలు, సొంతంగా వాటర్ బాటిళ్లను తెచ్చుకోవటం ద్వారా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నెల 13నుంచి స్వీట్​ అండ్​ కైట్​ ఫెస్టివల్​

ఇవీ చూడండి: దయచేసి వినండి మీరు వెళ్లాల్సిన రైళ్లన్ని రద్దీగా ఉన్నాయి!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.