ETV Bharat / state

ఎవరికి వారే యమునా తీరే... హస్తం పార్టీలో అంతర్గత పోరు - tpcc latest updates

రాష్ట్ర కాంగ్రెస్‌... అంతర్గత విబేధాలతో సతమతమవుతోంది. ఎవరికి వారే యమునా తీరులా హస్తం పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఆశావహులు ఎవరికి వారే లాబీయింగ్‌ చేసుకోవడమే కాక... ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. 111 జీవోను రద్దు చేయాలని కొందరు... జీవోకు వ్యతిరేఖంగా జరిగిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని మరికొందరు నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Internal disputes in state congress
హస్తం పార్టీలో అంతర్గత పోరు
author img

By

Published : Mar 12, 2020, 5:59 AM IST

హస్తం పార్టీలో అంతర్గత పోరు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల మధ్య అంతర్గత విబేధాలు తారస్థాయికి చేరుతున్నాయి. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి అరెస్టు తరువాత అంతర్గత విబేధాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. 111 జీవో కారణంగా రంగారెడ్డి జిల్లా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని.. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే జీవో రద్దుకు ఒత్తిడి పెరిగింది. కానీ అనివార్యకారణాల కారణంగా అప్పట్లో రద్దు కాలేదు.

111జీవోకు వ్యతిరేకంగా..

తాజాగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి 111 జీవోకు వ్యతిరేఖంగా పెద్ద పెద్ద భవంతుల నిర్మాణాలు జరుగుతున్నాయని... వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనుమతి లేకుండా డ్రోన్‌ కెమెరాలు వాడి... ఓ ఫార్మ్​హౌజ్‌ నిర్మాణాలను చిత్రీకరించడంపై పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

రెండు వర్గాలుగా చీలిక..

రేవంత్​రెడ్డి అరెస్టును పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితోపాటు పలువురు సీనియర్‌ నేతలు ఖండించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి. హనుమంతురావులాంటి వారు 111 జీవో అంశంపై పార్టీలో చర్చకు రాలేదని స్పష్టం చేస్తున్నారు. ఎంపీ రేవంత్‌ రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను రుజువు చేసుకోకుండా పోరాటం చేయడం ఏంటని ప్రశ్నించారు. 111జీవోపై రేవంత్‌ వ్యక్తిగతంగా పోరాటం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌ రెడ్డి అరెస్టుతో కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో రెండు వర్గాలుగా చీలిక వచ్చిందని చెప్పొచ్చు.

నూతన పీసీసీ నియామకమైతే..

కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ అధికం కావడం.. ఎవరికి వారు వారికి తోచినది మాట్లాడుతున్నారు. నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకం జరిగితే వీటన్నింటికి తెరపడుతుందని.. పరిస్థితులు పూర్తి స్థాయిలో చక్కబడతాయని భావిస్తున్న పార్టీ శ్రేణులకు నిరాశనే మిగులుతోంది. తాజాగా దిల్లీ, కర్ణాటక రాష్ట్రాలకు నూతన పీసీసీ అధ్యక్షులను ప్రకటించగా... రాష్ట్ర పీసీసీని కూడా కాంగ్రెస్‌ అధిస్ఠానం ఏ క్షణంలో అయినా ప్రకటించొచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నియామకమై... నాలుగేళ్లు దాటడం వల్ల త్వరలో కొత్త అధ్యక్షుడి నియామకం కావడం ఖాయమన్న ధీమా పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.

ఇదీ చూడండి: తెలంగాణలో నా లక్ష్యం అదే... దాని కోసమే పని చేస్తా: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.