అనామిక అనే విద్యార్థినికి ఇంటర్ ఫలితాలు వచ్చినప్పుడు తెలుగులో 20 మార్కులు వచ్చి ఫెయిల్ అయింది. మనస్తాపం చెందిన అనామిక ఆత్మహత్య చేసుకుంది. రీ వెరిఫికేషన్లో ఆ విద్యార్థినికి 48 మార్కులు వచ్చాయి. విద్యార్థి మృతికి ఇంటర్ బోర్డే కారణమంటూ అనామిక కుటుంబం నుంచి విమర్శలు రావడం వల్ల... ఇంటర్ బోర్డు రీ వెరిఫికేషన్లోనూ అనామిక ఫెయిల్ అయ్యిందని వెల్లడించింది. రీ వెరిఫికేషన్లో 21 మార్కులు మాత్రమే వచ్చాయని అధికారులు తెలిపారు. అనామికకు 48 మార్కులు వచ్చినట్లు తప్పుగా అప్లోడ్ అయ్యిందని బోర్డు తెలిపింది. ఈ వ్యవహారంపై విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికీ కూడా ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల విద్యావేతలు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ ట్వీట్
ఈ వ్యవహరంపై మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. అనామిక ఫెయిల్ కాలేదని.. ఆమె మృతికి ఇంటర్ బోర్డు, గ్లోబరీన బాధ్యత వహించాలని ట్వీట్ చేశారు. 302, 304ఏ, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: అదృశ్యమైన బాలుర మృతదేహాలు చెక్కపెట్టెలో లభ్యం