ETV Bharat / state

Inter Board: కళాశాలల అనుబంధ గుర్తింపు కోసం ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ - సయ్యద్ ఒమర్ జలీల్

Inter Board: ఈ విద్యా సంవత్సరానికి ప్రైవేట్ జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు కోసం ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులను ఏప్రిల్ 5 వరకు ఆలస్య రుసుము లేకుండా ఆన్​లైన్​లో సమర్పించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు.

Inter Board
ఇంటర్ బోర్డు నోటిఫికేషన్
author img

By

Published : Mar 23, 2022, 4:57 AM IST

Inter Board: రానున్న విద్యా సంవత్సరానికి ప్రైవేటు జూనియర్ కళాశాలల అనుబంధ గుర్తింపు కోసం ఇంటర్మీడియట్‌ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 5వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు.

మే చివరి నాటికి జాబితా

రూ.1000 నుంచి రూ.20 వేల వరకు ఆలస్య రుసుంతో మే 17 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. మే 31 నాటికి గుర్తింపు పొందిన కళాశాలల జాబితా బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు పేర్కొన్నారు. అనుబంధ గుర్తింపుతో పాటు అదనపు సెక్షన్లు, భవనం మార్పు వంటి వాటికి కూడా దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని.. ఆఫ్‌లైన్‌లో ఇస్తే స్వీకరించబోమని జలీల్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

High court: హైకోర్టుకు మరో 10 మంది న్యాయమూర్తులు.. ఉత్తర్వులు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.