సంక్షేమంలో తామే నెంబర్ వన్‌గా ఉన్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు. సంక్షేమం కోసం రూ.40 వేల కోట్లు వ్యయం చేస్తున్నామని తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. 141 మున్సిపాలిటీల్లో వీటిని నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు.
భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ధూల్‌పేట్ సమస్యలు చెప్పారని.. ఆ ప్రాంతాన్ని తాను స్వయంగా సందర్శిస్తానని సీఎం చెప్పారు. దేశంలో మంచి విధానాలు ఎక్కడున్నా తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. ప్రజాదర్బార్ ఏర్పాటు చేసి పోడు భూముల సమస్య పరిష్కరిస్తామన్నారు. భవిష్యత్‌లో పోడు భూములకు కూడా రైతుబంధు ఇస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: 321.98 కోట్ల ఆదాయానికి గండి: కాగ్