ETV Bharat / state

థర్మల్‌ కేంద్రాల్లో తనిఖీలు ముమ్మరం - శ్రీశైలం ప్రమాదం

శ్రీశైలం జలవిద్యుత్కేంద్ర ప్రమాదంతో రాష్ట్రంలోని ఇతర విద్యుత్కేంద్రాలన్నీ అప్రమత్తమయ్యాయి. ఇంతకాలం భద్రతా ప్రమాణాలు, తనిఖీలపై పెద్దగా శ్రద్ధ చూపని అధికారులు రంగంలోకి దిగారు. విద్యుదుత్పత్తి కేంద్రాల్లోనే కాకుండా విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల్లోనూ భద్రత చర్యలు పెంచారు. అధునాతన పరిజ్ఞానంతో కూడిన అగ్నిమాపక పరికరాలు కొనాలని దక్షిణ డిస్కం తాజాగా నిర్ణయించింది.

Inspections at thermal centers in telangana
థర్మల్‌ కేంద్రాల్లో తనిఖీలు ముమ్మరం
author img

By

Published : Aug 27, 2020, 6:54 AM IST

పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, ప్యానల్‌ బోర్డులున్నచోట ఆధునిక పరికరాలను ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. ప్రతి విద్యుత్కేంద్రంలో భద్రతా విభాగానికి ప్రత్యేకంగా ఉప కార్వనిర్వాహక ఇంజినీరు (డీఈ), సహాయ ఇంజినీరు (ఏఈ), ఇతర సిబ్బంది ఉంటారు. వీరు 24 గంటలూ (నిరంతరం) ప్రతి విభాగాన్ని తనిఖీ చేస్తుండాలి. ఎక్కడైనా షార్ట్‌సర్క్యూట్‌తో గాని, ఇతర కారణాలతో గాని మంటలు వచ్చే అవకాశముందా, తీగలు సరిగా ఉన్నాయా, బ్యాటరీల ఛార్జింగ్‌ సరిగా ఉందా తదితర అన్ని విషయాలు పక్కాగా పరీక్షిస్తుండాలి. ‘శ్రీశైలం’లోనూ ఈ వ్యవస్థ ఉంది. అయితే తాజా ప్రమాదంతో ఇతర విద్యుత్కేంద్రాల్లో తనిఖీలు సక్రమంగా జరుగుతున్నాయో లేదో పరిశీలించాలని ఆయా కేంద్రాల అధిపతులైన చీఫ్‌ ఇంజినీర్ల(సీఈ)లను జెన్‌కో ఆదేశించింది.

అధిక వేడి, ఉష్ణోగ్రతలుండే బాయిలర్లతో నడిచే బొగ్గు ఆధారిత థర్మల్కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సాధారణంగా సీఈ ఎక్కువగా పాలనా వ్యవహారాలు చూస్తుంటారు. వారానికోమారు ప్రతి థర్మల్కేంద్రంలో మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తారు. ఎక్కడైనా ఒకచోట చిన్న అగ్నిప్రమాదం సృష్టించి అలారం మోగిస్తారు. అన్ని విభాగాల సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పడానికి చర్యలు తీసుకోవాలి. శ్రీశైలం ప్రమాదంతో ప్రతి కేంద్రంలో సీఈనే నేరుగా అన్ని విభాగాలకు వెళ్లి తనిఖీలు చేస్తున్నారని కొత్తగూడెం థర్మల్‌ కేంద్రంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ‘ఈనాడు’కు తెలిపారు. శ్రీశైలంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని ఉంటే ప్రమాదం జరిగే ఆస్కారం ఉండేది కాదని ఆయన పేర్కొన్నారు.

ప్రమాదాల నివారణకు అన్ని జాగ్రత్తలు

దేశంలోని పలు విద్యుత్కేంద్రాల్లో గతంలో జరిగిన ప్రమాదాలు, పేలుళ్ల సమాచారాన్ని రాష్ట్రంలోని అన్ని విద్యుత్కేంద్రాల ఉన్నతాధికారులకు జెన్‌కో పంపించింది. ఆయా ప్రమాదాలు జరిగిన తీరును పరిశీలించి.. ఇక్కడ అలాంటివి జరగకుండా గట్టి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉదాహరణకు తమిళనాడులోని నైవేలీ థర్మల్కేంద్రంలో ఇటీవల బాయిలర్‌ను తనిఖీ చేస్తుండగా మంటలు వచ్చి పేలిపోయింది. ఈ దుర్ఘటనలో 13 మంది చనిపోగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెండు నెలలకే అదే కేంద్రంలోని మరో యూనిట్‌లో ప్రమాదం జరగడం గమనార్హం. థర్మల్కేంద్రాల్లో బాయిలర్ల నిర్వహణ చాలా కీలకం. తెలంగాణలో కొత్తగూడెం, రామగుండంలోని థర్మల్కేంద్రాలను నిర్మించి మూడు దశాబ్దాలు దాటింది. వీటిలో పురాతన యంత్రాలతోనే పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి జరుగుతున్నందున అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జెన్‌కో సూచించింది. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు మంటలు వ్యాపించకుండా నివారణకు ఫోమ్‌ యంత్రాలు వాడాలి. అంతర్జాతీయ స్థాయిలో ఆధునాతన యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని సమకూర్చుకుంటే ప్రమాదాలను వెంటనే నియంత్రించడానికి అవకాశం ఉంటుందని ఓ సీనియర్‌ ఇంజినీరు వివరించారు. వాటిని అన్ని కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు.

ఇదీ చూడండి: 'ఈటీవీ'కి మహేశ్​ రజతోత్సవ శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.