ETV Bharat / state

CBI Court: జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

author img

By

Published : Jul 26, 2021, 12:25 PM IST

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను ఈ నెల 30కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.

ap cm jagan
ap cm jagan

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. లిఖితపూర్వక వాదనలు వినిపించేందుకు సీబీఐ మరింత సమయం కోరింది. పరిగణలోకి తీసుకున్న సీబీఐ న్యాయస్థానం.. విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. రఘురామ కృష్ణరాజు, జగన్ తరఫు న్యాయవాదులు ఇప్పటికే తమ వాదనలను కోర్టుకు లిఖితపూర్వకంగా సమర్పించిన విషయం తెలిసిందే.

విచక్షణ మేరకు చట్ట ప్రకారం పిటిషన్‌లోని అంశాలపై నిర్ణయం తీసుకోవాలని సీబీఐ గతంలో కోర్టుకు వివరించింది. అయితే తాము కూడా లిఖితపూర్వకంగా వాదనలు సమర్పిస్తామని.. పది రోజుల సమయం ఇవ్వాలని ఈ నెల 14న కోర్టును సీబీఐ కోరింది. అంగీకరించిన సీబీఐ కోర్టు నేటికి వాయిదా వేసింది. ఇవాళ కూడా మరోసారి సీబీఐ సమయం కోరిన మేరకు వాయిదా పడింది.

ఇదీ చూడండి: దళిత బంధు పథకంపై అవగాహన సమావేశం ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.