ETV Bharat / state

Harish rao: 'ఆ ఆస్తుల వివరాలు త్వరగా సమర్పించాలి'

రాష్ట్రంలో అన్ని శాఖల పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాలు, ఆస్తుల వివరాలను వీలైనంత తొందరగా సమర్పించాలని మంత్రి హరీశ్​రావు(Harish rao) అధికారులకు సూచించారు. సీఎస్​ సోమేశ్ కుమార్(somesh kumar), అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశమైన ఆయన.. విభజన చట్టం తొమ్మిది, పదో షెడ్యూళ్లలో ఉన్న సంస్థల విభజన, తదితర అంశాలపై చర్చించారు.

Harish rao cs meet
Harish rao: 'ఆ ఆస్తుల వివరాలు త్వరగా సమర్పించాలి'
author img

By

Published : Jun 10, 2021, 10:35 PM IST

అన్ని శాఖల పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాలు, ఆస్తుల వివరాలను వీలైనంత త్వరగా సమర్పించాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​ రావు(Harish rao) అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్(somesh kumar), అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశమైన ఆయన... ఆయా శాఖల పరిధిలోని ఆస్తులు, విభజనాంశాలపై సమీక్షించారు.

విభజన చట్టం తొమ్మిది, పదో షెడ్యూళ్లలో ఉన్న సంస్థల విభజన ప్రక్రియ, ప్రస్తుత స్థితి, ఇబ్బందులు, న్యాయ పరమైన అంశాలపై శాఖల వారీగా మంత్రి సమావేశంలో చర్చించారు. అన్ని శాఖల పరిధిలోని ప్రభుత్వ భవనాలు, ఆస్తుల వివరాల సేకరణ ప్రక్రియను కూడా హరీశ్​రావు సమీక్షించారు. ఆయా శాఖల పరిధిలో కేటాయింపుల పోస్టుల వివరాలు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు, ఖాళీలు, సంబంధిత వివరాలను కూడా ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఇదీ చూడండి: 'రేపటి నుంచి వ్యవసాయ శాఖ కార్యాలయాల ముందు ధర్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.