Inorbit Durgam Cheruvu Run 2022: హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ తమ రెండో ఎడిషన్ ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ 2022.. కేబుల్ బ్రిడ్జి దగ్గర విజయవంతంగా నిర్వహించింది. స్పోర్ట్స్ బ్రాండ్ పూమా కంపెనీతో సంయుక్తంగా ఏర్పాటు చేసింది.
21కె రన్‌ను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర జెండా ఊపి ప్రారంభించారు. 10కె రన్ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్... 5కె రన్‌కు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్ జెండా ఊపారు. దివ్యాంగుల కోసం నిర్వహించిన మారథాన్‌ను మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్ జెండా ఊపి ప్రారంభించారు.
దాదాపు ఈ రన్‌లో 3 వేల మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 90 మంది దివ్యాంగులు పాల్గొనడంతో పాటుగా దుర్గం చెరువు కేబుల్ వంతెనపై 100 మీటర్లు నడవడం ద్వారా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి కలిగించారు. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 30 లక్షల రూపాయలను సేకరించారు.
ఇదీ చదవండి: Green India Challenge: 'ఒక్క చెట్టు నాటడం అంటే.. తల్లి ప్రేమను పొందడం లాంటిదే'