ETV Bharat / state

Toxic gas from industries: తీవ్రమైన వాయువుల ఘాటు.. ఊపిరాడితే ఒట్టు

జీవులకు ప్రాణాధారం ఆక్సిజన్​.. స్వచ్ఛమైన వాయువు పీలిస్తేనే ఏ ప్రాణి అయినా ఊపిరితిత్తుల సమస్యలు లేకుండా, అనారోగ్య సమస్యలు తలెత్తకుండాా జీవించగలదు. కానీ ప్రస్తుత కాలంలో స్వచ్ఛమైన ఆక్సిజన్​ దొరకడం గగనంగా మారింది. పెరుగుతున్న పరిశ్రమలు.. అవి వదులుతున్న విషవాయువులు జీవులకు ప్రాణసంకటంగా మారాయి. పరిశ్రమలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్రమైన వాయువుల ఘాటుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిగా గాల్లో విష వాయు వ్యర్థాలను చిమ్మేస్తున్నారు.

Toxic gas from industries
పరిశ్రమల నుంచి విష వాయువులు
author img

By

Published : Nov 10, 2021, 7:47 AM IST

నిబంధనలు పాటించని పరిశ్రమల నుంచి వస్తున్న ఘాటైన వాసనలతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రసాయన, బల్క్‌డ్రగ్‌ పరిశ్రమలు చిమ్మే విషవాయువుల కారణంగా వాంతులు, విరేచనాలు, తల తిరగడం, కళ్ల మంటలు తదితర సమస్యలతో అల్లాడిపోతున్నారు. వీటిపై ఒక్క అక్టోబరులోనే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)కి 665 ఫిర్యాదులు రావటం గమనార్హం. హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో ఈ సమస్య అధికంగా ఉంది.
ప్రజల ఫిర్యాదుల నేపథ్యంలో పీసీబీ అధికారులు కాలుష్యకారక పరిశ్రమలపై దృష్టిపెట్టారు. రామచంద్రాపురం జోన్‌లో గడ్డపోతారం, పటాన్‌చెరు, ఐడీఏ బొల్లారం, ఖాజిపల్లి తదితర పారిశ్రామికవాడల్లోని 54, హైదరాబాద్‌ జోన్‌లో మేడ్చల్‌, జీడిమెట్ల పారిశ్రామికవాడల్లోని 20 పరిశ్రమల నుంచి ఘాటైన వాసనలు అధికంగా వస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో చౌటుప్పల్‌ ప్రాంతంలో, హైదరాబాద్‌-బెంగళూరు మార్గంలో కొత్తూరు, షాద్‌నగర్‌ ప్రాంతాల్లోకి వెళ్లగానే భరించలేని ఘాటైన వాసనలు వస్తున్నాయని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు.

.

పరిశ్రమల నిర్లక్ష్యంతోనే..

నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి పలు పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించటం లేదు. ఫలితంగా ఉత్పత్తుల తయారీ సమయంలో అవి విషవాయు వ్యర్థాల్ని భారీగా గాల్లో కలిపేస్తున్నాయి. ఇలాంటి సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయని.. తనిఖీలు, చర్యలకు అధికారుల్ని ఆదేశించామని పీసీబీ సభ్యకార్యదర్శి నీతూకుమారి ప్రసాద్‌ ‘ఈనాడు- ఈటీవీ భారత్​'కు తెలిపారు.

విస్తృత తనిఖీలు..

ఫిర్యాదులపై ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేస్తున్నాం. నైట్‌ పెట్రోలింగ్‌ బృందాల సంఖ్యను ఒకటి నుంచి మూడుకు పెంచాం. జోన్లవారీగా కాలుష్యకారక అనుమానిత పరిశ్రమల్ని గుర్తించి అధికారులు తనిఖీ చేస్తున్నారు. కంపెనీల్లో స్క్రబ్బర్లు సవ్యంగా ఆమర్చారా? వాసన నియంత్రణ చర్యలు తీసుకున్నారా?.. అన్నది పరిశీలిస్తున్నాం. 665కి గాను 596 ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపాం. - రఘు, చీఫ్‌ఇంజినీర్‌, పీసీబీ

బాధితులు ఇంటికొకరు..

వాయుకాలుష్య బాధితులు ప్రతి కుటుంబంలో ఒకరుంటారు. చిన్నప్పుడు నా కాళ్లు బాగానే ఉండేవి. కాలుష్యం కారణంగా వంకరపోయాయి.

- వంట ఎల్లయ్య, గడ్డపోతారం

నిత్యం నరకమే..

పరిశ్రమల నుంచి ముక్కుపుటాలు అదిరేలా వాసనలు వస్తున్నాయి. భరించలేక గ్రామస్తులు వాంతులు చేసుకుంటున్నారు. రోజూ నరకమే. వారానికి ఒకరిద్దరు ఏదో ఒక జబ్బుతో మరణిస్తున్నారు. కాలుష్యప్రభావంతోనే అని భావిస్తున్నాం.

- జానాబాయి, ఎంపీటీసీ, గడ్డపోతారం

అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా

పరిశ్రమల నుంచి వెలువడే వాయుకాలుష్యంపై పీసీబీ అధికారులకు ఎన్నిమార్లు ఫిర్యాదుచేసినా ఫలితం లేదు. స్థానికుల ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తోంది.

- నవీన్‌, కిష్టాయిపల్లి

గాఢత తక్కువ చూపేలా ఏర్పాట్లు.. మీటర్లకు తూట్లు?

ఘాటైన వాయువులు పరిమితికి మించి వెలువడితే గుర్తించడానికి ప్రతి పరిశ్రమలో ఆన్‌లైన్‌ వోలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్‌(వీవోసీ) మీటర్లు పెట్టి పీసీబీలో సర్వర్‌కు అనుసంధానించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పలు కంపెనీల్లో ఘాటైన వాసనలు సరిగా నమోదవటం లేదని సమాచారం. వీవోసీ మీటర్‌ కిందిభాగంలో పొగ గొట్టానికి రంధ్రంపెట్టి వాయువ్యర్థాల్ని దారి మళ్లిస్తుండటంతో గాఢత తక్కువ నమోదవుతున్నట్లు తెలుస్తోంది. స్క్రబ్బర్లు సరిగా పనిచేస్తే వ్యర్థాలు శుద్ధిఅవుతాయి. కానీ, కొన్ని పరిశ్రమల్లో వీటిని పనిచేయకుండా ఆపేస్తున్నారు. రాత్రిపూట అధికారుల తనిఖీలు ఉండవన్న భరోసాతో చీకటి మాటున ఘాటైన వాయువుల్ని ఇష్టారాజ్యంగా వదిలేస్తున్నారు.

ఇదీ చదవండి: tharun chug: 'ప్రజల సొమ్ము దోచుకుంటున్న వారిని కేంద్రం గమనిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.