జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడుగా ఉన్న పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా నిర్భందం నుంచి విడుదలయ్యారు. సెర్బియా నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చారు.
వాన్ పిక్‌లో పెట్టుబడులకు సంబంధించి యూఏఈలోని రస్ ఆల్ ఖైమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిమ్మగడ్డ ప్రసాద్‌పై గతంలో రెడ్‌కార్నర్ నోటీసు జారీఅయింది. నోటిసు ఆధారంగా గతేడాది జులైలో సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్టు చేశారు. అనంతరం దేశం విడిచి వెళ్లరాదన్న షరతుతో బెయిల్ మంజూరైంది.
రెడ్‌కార్నర్ నోటీసు ఆధారంగా తనను నిర్బంధించడాన్ని సవాల్ చేస్తూ నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా సుప్రీంకోర్టును సవాల్ చేశారు. విచారణ జరిపిన కోర్టు నిర్బంధం చెల్లదని తీర్పునిచ్చింది. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా నిమ్మగడ్డ ప్రసాద్‌ను విమానాశ్రయం నుంచి క్వారంటైన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: దిశ తరహా మరో ఘటన.. రంగారెడ్డి జిల్లాలో మహిళ హత్యాచారం