సాహిత్య రంగంలో లబ్ద ప్రతిష్టులైన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ(76) ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. ఏడాది కాలంగా అయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. నేరేడ్‌మెట్ ఆర్‌కే పురంలోని తన స్వగృహంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన సతీమణి ఇంద్రగంటి జానకీబాల ప్రముఖ రచయిత్రి. కుమారుడు మోహనకృష్ణ సినిమా దర్శకునిగా రాణిస్తున్నారు. కుమార్తె కిరణ్మయి బెంగళూరులో స్థిరపడ్డారు. కవిత్వం, లలిత గీతం, చలన చిత్ర గీతం, యక్షగానం, కథ, నవల, నాటకం, నాటిక, వ్యాసం, పత్రికా రచన... ఇలా బహు రూపాలుగా శ్రీకాంతశర్మ ప్రతిభ వికసించింది.
శ్రీకాంత శర్మ 1944 మే 29న జన్మించారు. ఇటీవలే ఆయన 'ఇంటిపేరు ఇంద్రగంటి' పేరుతో తన ఆత్మకథను వెలువరించారు. గత 50 సంవత్సరాల్లో తానెరిగిన సాహిత్య జీవితాన్ని, అలాగే తన కుటుంబ విశేషాలను, రచయితగా తన అనుభవాలను కలగలిపి ఈ ఆత్మ కథ రాసి 2018 జనవరిలో విడుదల చేశారు.
ఇదీ చూడండి : ధర్నాచౌక్ వద్ద తెదేపా నేతల ఆందోళన... అరెస్టు