శాస్త్రీయ పరిశోధనలకు మద్దతు ఇవ్వాలని ఇండియా మార్చ్ ఫర్ సైన్స్ ఆర్గనైజేషన్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ఇండియన్ మార్చ్ ఫర్ సైన్స్ ఆర్గనైజేషన్ సదస్సులో పలువురు విద్యావేత్తలు , మేధావులు , ఆచార్యులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. దేశంలో సాధారణ విద్య, శాస్త్రీయ పరిశోధనలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మేధావులు ఆవేదన వ్యక్తం చేశారు. శాస్త్ర పరిశోధనలకు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో నిధులు కేటాయించాలని కోరారు. వాతావరణ కాలుష్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని... కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వాలు విజ్ఞానశాస్త్ర పరమైన విధివిధానాలు చేపట్టాలని సూచించారు.
ఇదీ చూడండి: కలల కశ్మీరం నిర్మిద్దాం రండి: ప్రజలకు మోదీ పిలుపు