జర్మనీలోని మునిచ్ నగరంలో ఆన్‌లైన్ వేదికగా ప్రవాస భారతీయులు... పీవీ శతజయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, పీవీ మనమడు పీవీ కశ్యప్, తెరాస జర్మనీ ఎన్‌ఆర్‌ఐ సమన్వయకర్త మహేష్ బిగాల తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెరాస ఎన్‌ఆర్‌ఐ జర్మనీ ప్రెసిడెంట్ అరవింద్ గుంత, వైస్ ప్రెసిడెంట్ నరేష్ మేసినేని, ప్రతినిధులు.. వీవీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు బాటవేసిన రాజనీతిజ్ఞుడు పీవీ నరసింహారావుతో తమకు గల అనుబంధాన్ని కేకే గుర్తుచేసుకున్నారు. ఇప్పటికే జర్మనీతో పీవీకి గల అనుబంధంపై తాను రాసిన వ్యాసాలను పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీకి సమర్పించానని చెన్నమనేని రమేష్ తెలిపారు. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలే కాకుండా ఆయన ఓ మంచి గాయకుడు కూడా అని ఆయన మనమడు కశ్యప్ అన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలను జర్మనీలో పలు తెలుగు సంఘాలు ఆన్‌లైన్ వేదికగా వీక్షించారు.
ఇదీ చూడండి: యాదాద్రి పుణ్యక్షేత్రంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత