India vs England Test Cricket Match in Uppal Stadium : భారత్- ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్‌కు హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం(Uppal Stadium) వేదిక కానుంది. ఈనెల 25 తేదీ నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. టెస్టు మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లను ఈనెల 18 తేదీ నుంచి విక్రయిస్తున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు. పేటీఎం ఇన్‌సైడర్ మొబైల్ యాప్‌లో, అదే విధంగా www.insider.in వెబ్‌సైట్‌లో టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించనున్నట్లు చెప్పారు.
క్రికెట్లో ఆల్‌టైమ్ బెస్ట్ క్యాచ్- వీడియో చూశారా?
Ind vs Eng Test Cricket Match : 22వ తేదీ నుంచి ఆఫ్‌లైన్‌లో సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో టిక్కెట్లు లభిస్తాయన్నారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు ఏదైనా తమ ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి, టిక్కెట్లను రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దేశం కోసం అహర్నిశలు తమ రక్తం ధారబోస్తున్న భారత సాయుధ దళాల సిబ్బందిని రిపబ్లిక్ డే రోజున ఉచితంగా ప్రవేశ కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణలో పని చేస్తున్న భారత సాయుధ బలగాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బందికి వారి కుటుంబాలతో కలిసి ఉచితంగా మ్యాచ్ వీక్షించవచ్చన్నారు. ఆసక్తి గల వారు తమ విభాగాధిపతితో సంతకం చేయించిన లేఖ, కుటుంబ సభ్యుల వివరాలను ఈనెల 18వ తేదీ లోపు హెచ్‌సీఏ సీఈఓకి ఈ-మెయిల్ చేయాలని సూచించారు. స్కూల్ విద్యార్థులకు రోజుకు ఐదు వేలు చొప్పన, మొత్తం 5 రోజులకు గానూ 25 వేల కాంప్లిమెంటరీ పాసులు కేటాయించామన్నారు.
'విరాట్, నేను చాటింగ్ చేసుకుంటున్నాం- క్రికెట్ నేర్చుకున్నాక భారత్‌కు వస్తా'
వీరందరికి ఉచిత భోజనం, తాగునీరు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులను ఉచితంగా అనుమతిస్తామని ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 300లకు పైగా పాఠశాలల నుంచి అర్జీలు వచ్చాయన్నారు. స్కూల్స్ తమ విద్యార్థుల పేరు, క్లాస్ సహా పూర్తి వివరాలను పంపించాలన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా స్కూల్ యూనిఫామ్స్‌లో ఐడీ కార్డ్స్ వెంట తీసుకొని రావాలని, స్టేడియంలోకి ప్రవేశించాక విద్యార్థుల బాధ్యత సంబంధిత పాఠశాల సిబ్బందిదేనని పేర్కొన్నారు. టెస్టు మ్యాచ్ టిక్కెట్ ప్రారంభ ధర కనిష్ఠంగా రూ.200 కాగా, గరిష్ఠంగా రూ.4 వేలుగా నిర్ణయించామన్నారు.
రంజీ ట్రోఫీలో మెడల్ ప్రజెంటేషన్- క్రికెట్లో పతకం ఇదే తొలిసారి!