రాగల మూడ్రోజులు రాష్ట్రంలో చిరుజల్లులు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని పేర్కొంది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. ఇది ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి ఉందని వెల్లడించారు.
ఉత్తర అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లోనూ సుమారుగా అక్టోబర్ 9 తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.