హైదరాబాద్ నగరంలో పంద్రాగస్టు సందడి మొదలైంది. ప్రధాన ప్రాంతాల్లో త్రివర్ణ కాంతులుతో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు ప్రజల ముఖాలపై జెండా రంగులు పులుముతున్నాయి. రహదారుల పక్కన చెట్లకు, భారీ భవంతులకు ఏర్పాటు చేసిన వెలుగుల్లో నిశిరాత్తిరి వేళ నింగి, నేల మధ్య జాతీయ జెండా రెపరెపలాడుతున్నట్లుగా ప్రకాశిస్తున్నాయి విద్యుద్దీపాలు. జెండా పండుగ కోసం....నగరంలోని అసెంబ్లీ, బీఆర్కే భవన్, శాసనమండలి, నాంపల్లి పబ్లిక్ గార్డెన్, అమరవీరుల స్థూపం త్రివర్ణ కాంతులతో వెలిగిపోతున్నాయి.
ఇదీ చూడండి: ధగధగ విద్యుత్ కాంతులతో కాళేశ్వరం ప్రాజెక్టు