Independence Day Celebrations in BJP Office : బుజ్జగింపు, కుటుంబ, అవినీతి, నియంతృత్వ రాజకీయాలకు దూరంగా ఉండాలని.. దేశంలోని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని.. కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో ఎంపీ డా.లక్ష్మణ్, ఇంద్రసేనా రెడ్డి, ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్, ప్రేమేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ రక్షణలో అమరులైన వీరా రాజారెడ్డి తల్లిదండ్రులను కిషన్ రెడ్డి సన్మానించారు.
'స్వాతంత్య్ర సమరయోధుల ఆకాంక్షలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోంది. 2047 నాటికి పేదరిక నిర్మూలన జరగాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తోంది. ప్రపంచమంతా మనవైపే చూస్తోంది' అని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్, కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Telangana BJP 2023 Elections Plan : 'పార్టీ బలహీనంగా ఉన్న చోట త్వరితగతిన బలోపేతం చేయాలి'
Kishan Reddy Comments On CM KCR : మరోసారి కేసీఆర్ కుటుంబం అధికారంలోకి వస్తే తెలంగాణ అధోగతి పాలవుతుందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. భూములు కనిపిస్తే చాలు అక్రమించేస్తున్నారని.. వేలం వేసేస్తున్నారని మండిపడ్డారు. ధరణి పేరుతో రైతుల పొట్ట కొడుతున్నారన్నారు. మరో పక్క రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని వాపోయారు. ప్రతి పని, ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం 30 శాతం వాటా తీసుకొని పాలన సాగిస్తోందని ఆరోపించారు.
Kokapet Land Auction : కోట్లు కురిపించిన కోకాపేట నియోపోలీస్ భూముల వేలం.. ఎకరానికి ఎంతంటే ?
"మోదీ ప్రభుత్వం 2047 నాటికి పేదరిక నిర్మూలన జరగాలనే సంకల్పంతో పని చేస్తుంది. ప్రపంచమంతా మన వైపే చూస్తోంది. మరోసారి కేసీఆర్ కుటుంబం అధికారంలోకి వస్తే తెలంగాణ నాశనం అయిపోతుంది. ఎక్కడ భూములు కనిపించినా అక్రమించేస్తున్నారు. ఖాళీ స్థలాలను వేలం వేస్తున్నారు. ధరణి పేరుతో రైతులను కేసీఆర్ నట్టేట ముంచుతున్నారు. కల్వకుంట్ల చేతిలో తెలంగాణ బందీ అయిపోయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. కాంగ్రెస్ పాలకులు కమీషన్లు తీసుకుంటే.. బీఆర్ఎస్ పాలకులు వాటాలు తీసుకుంటున్నారు అంతే.- కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు
Kishan Reddy Fires On BRS : తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ప్రశ్నించే వారిని నిర్భందిస్తారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. నోటిఫికేషన్ వేయడం, రద్దు చేయడంతో యువత గోస పడుతున్నారన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో విశ్వవిద్యాలయాలు కళావిహీనంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందు దొందేనని తెలిపారు. కాంగ్రెస్ పాలకులు కమీషన్లు తీసుకుంటే.. ప్రస్తుతం బీఆర్ఎస్ పాలకులు వాటాలు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే బీఆర్ఎస్కు వేసినట్లేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
'సొంతింటి కోసం కొత్త పథకం.. రూ.లక్షల్లో ప్రయోజనం'.. ఎర్రకోటపై ప్రధాని మోదీ ప్రకటన