ETV Bharat / state

కృష్ణా నదిలో పెరిగిన ప్రవాహం... భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక - తెలంగాణలో భారీ వరదలు

కృష్ణా, గోదావరి నదులతో పాటు ఉప నదులకు వస్తున్నభారీ వరదను దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్​కుమార్ ద్వారా ఆదేశించారు. ఆన్​లైన్​లో సమీక్షించి కేంద్ర జల సంఘానికి పంపాల్సిన ప్రాజెక్టుల డీపీఆర్​ల రూపకల్పనపై సూచనలు చేశారు.

increased-flow
భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక
author img

By

Published : Sep 10, 2021, 8:06 AM IST

కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి ఎగువ నుంచి మళ్లీ ప్రవాహం ప్రారంభమైంది. ఆలమట్టి, నారాయణపూర్‌ జలాశయాలకు 30 వేలకుపైగా క్యూసెక్కులు వస్తుండటంతో అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. జూరాల వద్ద ఇప్పటికే 63 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశైలం వైపు 64 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. మొత్తంగా శ్రీశైలానికి 84 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. పులిచింతలకు 11 వేల క్యూసెక్కులు వస్తుండగా.. ప్రకాశం బ్యారేజీ వైపు 19 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టుకు 5,669 క్యూసెక్కులు వస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి 99 వేల క్యూసెక్కులు వదులుతున్నారు.

మొదటి ప్రమాద హెచ్చరిక

గోదావరి పరీవాహకంలో సింగూరు ప్రాజెక్టుకు 34 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. నిజాంసాగర్‌కు 44,600 క్యూసెక్కుల వరద వస్తుండగా దిగువకు 54 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీరామసాగర్‌కు 2.60 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దిగువకు 2.57 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి వద్ద ఇన్‌ఫ్లో 5.54 లక్షల క్యూసెక్కులుంది. దిగువకు 5.40 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. ధవళేశ్వరం ఆనకట్టకు 4.80 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఇక్కడి నుంచి సముద్రానికి 4.76 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరిలో మట్టం గురువారం తెల్లవారుజామున 3.35 గంటలకు 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సాయంత్రం 6 గంటలకు 46.8 అడుగులకు చేరుకుంది.

కృష్ణా, గోదావరి నదులతోపాటు ఉప నదులకు వస్తున్న భారీ వరదను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ ఆదేశించారు. గురువారం ఆయన పరిస్థితిని ఆన్‌లైన్‌లో సమీక్షించారు. సింగూరు, నిజాంసాగర్‌లతోపాటు ఎస్సారెస్పీ, జూరాల తదితర ప్రాజెక్టులకు వరద గురించి సీఈలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర జల సంఘానికి సమర్పించాల్సిన ప్రాజెక్టుల డీపీఆర్‌ల రూపకల్పనపైనా సూచనలు చేశారు. ఈఎన్‌సీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నేడూ, రేపూ కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు

రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర-మధ్య బంగాళాఖాతం సమీపంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడుతుందని, తదుపరి 48 గంటల్లో బలపడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు కరీంనగర్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి.

ఎన్పీడీసీఎల్‌కు రూ.3 కోట్ల నష్టం

ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఇటీవల వరదలతో ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్‌) పరిధిలో రూ.3 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు మొత్తం 543 విద్యుత్తు స్తంభాలు ధ్వంసమయ్యాయి. 1,312 వ్యవసాయ ఫీడర్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్‌ జిల్లాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ఎన్పీడీసీఎల్‌ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు తెలిపారు. వరద తీవ్రత తగ్గగానే పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

కొట్టుకుపోయిన అంతర రాష్ట్ర వంతెన

.

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం సాలూర వద్ద ఉన్న అంతర రాష్ట్ర లోలెవల్‌ వంతెన వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. 1934లో నిర్మించిన ఈ వంతెన మీదుగానే ఇప్పటివరకు భారీ వాహనాల రాకపోకలు సాగించాయి. పాత వంతెనకు ప్రత్యామ్నాయంగా 1984లో మరో వంతెన నిర్మించినా అది శిథిలావస్థకు చేరుకుంది. దీనిపై గతేడాది నుంచి 20 టన్నుల సామర్థ్యానికి మించిన వాహనాలను అనుమతించట్లేదు. పాత వంతెన కొట్టుకుపోవడంతో భారీ వాహనాలు బోధన్‌ మండలం ఖండ్‌గాం, కోటగిరి మండలం పోతంగల్‌ గుండా 40 కి.మీ.లకు పైగా చుట్టూ తిరిగి వెళ్తున్నాయి.

ఇదీ చూడండి: సైదాబాద్‌లో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు రువ్విన స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.