10th Class question papers choice questions: పదో తరగతి ప్రశ్నపత్రాల్లో వ్యాసరూప ప్రశ్నల సెక్షన్‌లో స్వల్పంగా ఛాయిస్ పెంచారు. ఆరు ప్రశ్నల్లో నాలుగింటికి సమాధానాలు రాస్తే చాలు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 28న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వ్యాసరూప ప్రశ్నల సెక్షన్‌లో ఇంతకుముందు ఇంటర్నల్ ఛాయిస్ మాత్రమే ఉంది.
అంటే ప్రతి ప్రశ్నలో ఏ లేదా బి అని రెండు ప్రశ్నలిస్తారు. అందులో ఏదో ఒకదానికి జవాబు రాయాలి. దీనిపై విమర్శలు వచ్చాయి. రెండేళ్లపాటు కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులకు దూరమై.. అభ్యసన సామర్థ్యాలు తగ్గాయని.. పరీక్షల విధానంలో మార్పులు చేయాలని.. ఛాయిస్ పెంచాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో తాజాగా ఇంటర్నల్ ఛాయిస్‌ను తొలగించింది. ఆరు ప్రశ్నల్లో నాలుగింటికి సమాధానాలు రాయాలని పేర్కొంది.
దీనివల్ల మిగిలిన రెండు సెక్షన్లలో ఒక్కో ప్రశ్నకు మార్కుల కేటాయింపు మారింది. ఈ మార్పు తెలుగు, ఆంగ్లం, హిందీ సబ్జెక్టులకు ఉండదు. మిగిలిన భాషేతర సబ్జెక్టులైన గణితం, సైన్స్, సోషల్‌లకు...అదీ వచ్చే ఏప్రిల్‌లో జరిగే వార్షిక పరీక్షలతో పాటు 2023-24 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మార్పులన్నీ తొమ్మిదో తరగతికీ వర్తిస్తాయి.
ఇవీ చదవండి: