ETV Bharat / state

రూ.2.16 లక్షల కోట్ల ఆదాయం.. బడ్జెట్లో ప్రభుత్వం అంచనా - రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రాబడులు

Telangana Budget 2023-24: తెలంగాణలో వివిధ పద్దుల కింద రూ.2,16,566.97 కోట్ల రాబడులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించింది. ఇది గత ఆర్థిక ఏడాది బడ్జెట్‌ అంచనాతో పోలిస్తే రూ.40,000 కోట్ల కంటే అధికంగా రాబడులు వస్తాయని అంచనా వేసింది. ప్రధానంగా కేంద్ర పన్నుల వాటా, రాష్ట్ర పన్నులు, పన్నేతర ఆదాయంతో పాటు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా ఈ మొత్తం వస్తుందని అంచనా వేసిన ప్రభుత్వం.. మరో రూ.55,000 కోట్లకు పైగా మొత్తం మూలధనం ద్వారా రాబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది.

Telangana Govt
Telangana Govt
author img

By

Published : Feb 6, 2023, 8:26 PM IST

Updated : Feb 7, 2023, 6:31 AM IST

Telangana Budget 2023-24: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పద్దుల కింద 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,16,566.97 కోట్లు రాబడి వస్తుందన్నఅంచనాతో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. అయితే 2022-23 ఆర్థిక ఏడాది బడ్జెట్‌లో ప్రవేశ పెట్టిన రూ.1,75,802.18 కోట్లతో పోలిస్తే.. రూ.40,764.79 కోట్లు అధికం. అంటే 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ కంటే 23.18శాతం ఎక్కువ.

రాబడుల్లో కేంద్ర పన్నుల వాటా కింద రూ.21,470.84 కోట్లు, పన్నుల రాబడి రూ.1,31,028.65 కోట్లు.. పన్నేతర ఆదాయం రూ.22,808.31 కోట్లు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా రూ.41,259.17 కోట్ల లెక్కన.. రూ.2,16,566.97 కోట్లు వస్తుందని ప్రభుత్వం తన బడ్జెట్‌లో స్పష్టం చేసింది. అదేవిధంగా మూలధనం ద్వారా రూ.55,277.68 కోట్లు సమకూర్చుకోనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది.

ఈ మొత్తంలో రుణాలు ద్వారా రూ.40,615.68 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాల ద్వారా రూ.4102 కోట్లు,.. డిపాజిట్ల లావాదేవీల ద్వారా రూ.4,000 కోట్లు, రుణాలు, అడ్వాన్స్‌ల ద్వారా మరో రూ.5,060 కోట్లు, అంతరాష్ట్ర సెటిల్‌మెంట్‌ ద్వారా రూ.17,828 కోట్లు వస్తుందని అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిన వివిధ రకాల పన్నుల ద్వారా రూ.1,31,028.65 కోట్లు వస్తుందని అంచనా వేసింది.

ఈ మొత్తంలో ఏయే పద్దుల కింద ఈ రాబడులు వస్తాయన్నది పరిశీలించినట్లయితే...

  • కేంద్ర జీఎస్టీ ద్వారా రూ.6,942.66 కోట్లు
  • రాష్ట్ర జీఎస్టీ ద్వారా రూ.44,000 కోట్లు
  • మొత్తం కలిసి కేంద్ర, రాష్ట్ర జీఎస్టీల ద్వారా రూ.50,942.66 కోట్లు వస్తుందని అంచనా

ఏయే పద్దుల కింద ఈ రాబడులు...

  • అదేవిధంగా కార్పొరేట్‌ ట్యాక్స్ ద్వారా రూ.6,872.08 కోట్లు
  • ఆదాయ పన్ను, ఇతర కార్పొరేట్‌ ట్యాక్స్‌ ద్వారా రూ.6,685.61 కోట్లు
  • ఇతరత్రా ఆదాయం ద్వారా రూ.650 కోట్లు
  • ఈ లెక్కన మొత్తం రూ.14,207.69 కోట్లు వస్తుందని అంచనా

ఏయే పద్దుల కింద ఈ రాబడులు...

  • ల్యాండ్ రెవెన్యూ ద్వారా రూ.12.05 కోట్లు
  • స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.18,500 కోట్లు
  • స్థిరాస్థి పన్నుల ద్వారా రూ.175 కోట్లు
  • ఈ లెక్కన మొత్తం రూ.18,686.87 కోట్లు వస్తుందని అంచనా

ఏయే పద్దుల కింద ఈ రాబడులు...

  • కస్టమ్స్‌ ద్వారా రూ.681.10 కోట్లు
  • కేంద్ర ఎక్సైజ్‌ సుంకాల ద్వారా రూ.285 కోట్లు
  • రాష్ట్ర ఎక్సైజ్‌ ద్వారా రూ.19,884.90 కోట్లు
  • అమ్మకపు పన్ను ద్వారా రూ.39,500 కోట్లు
  • వాహన పన్నుల ద్వారా రూ.7,512 కోట్లు
  • విద్యుత్తు పన్నులు, సుంకాల ద్వారా రూ.750 కోట్లు
  • సేవా పన్ను ద్వారా రూ.4.31 కోట్లు,
  • ఇతర పన్నులు, సేవల ద్వారా రూ.44.20 కోట్లు
  • ఈ లెక్కన జీఎస్టీయేతర రాబడుల కింద మొత్తం రూ.68,662.27 కోట్లు వస్తుందని అంచనా

ఏయే పద్దుల కింద ఈ రాబడులు...

  • వడ్డీ రాబడులు, ఇతరత్ర ద్వారా రూ.386.49 కోట్లు
  • పోలీసు, జైళ్లు, స్టేషనరీ, ముద్రణ, ప్రజాపనులు, ఇతర పరిపాలన సర్వీసులు, రికవరీలు, వివిధ సాధారణ సర్వీసులు ద్వారా రూ.13,754.62 కోట్లు
  • ఆర్థిక సేవల ద్వారా రూ.6,482.50 కోట్లు,
  • కేంద్ర ప్రభుత్వ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ద్వారా రూ.41,259.17 కోట్లు లెక్కన రాబడులు వస్తాయని అంచనా

ఇవీ చదవండి: రాష్ట్ర సర్కారు ప్రగతి ప్రస్థానానికి కొనసాగింపుగా.. మరోమారు భారీ బడ్జెట్‌

60 చదరపు అడుగుల దుకాణం ఖరీదు రూ.1.72కోట్లు.. అంత ధర ఎందుకంటే..

Last Updated : Feb 7, 2023, 6:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.