ETV Bharat / state

కొవిడ్ నేపథ్యంలో.. పెరిగిన వైద్య శాఖ వ్యయం - 2020-21 బడ్జెట్‌ కేటాయింపులు

2021-22 బడ్జెట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని రంగాలకు అధిక ప్రాధన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్‌ పేద ప్రజలకు ఆశాజనకంగా ఉంటుందని సమాచారం అందుతోంది. గతేడాది రాబడులపై కరోనా తీవ్ర ప్రభావం చూపినా.. పలు ప్రాధాన్య పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందనే చెప్పాలి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. బడ్జెట్‌ అమలు తీరును ఓసారి పరిశీలిద్దాం.

In the wake of the corona increased medical department spending 2020-21 budget
కరోనా నేపథ్యంలో.. పెరిగిన వైద్య శాఖ వ్యయం
author img

By

Published : Mar 18, 2021, 6:56 AM IST

రాబడులపై కరోనా తీవ్ర ప్రభావం చూపినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్య పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. బడ్జెట్‌లో కేటాయింపుల మేరకు నిధులు విడుదల చేసింది. వ్యవసాయం, సాగునీటి రంగాలకూ ప్రాధాన్యం ఇచ్చింది. రైతుబంధు, రుణమాఫీ, ఆసరా పింఛన్లు, సాగునీటి ప్రాజెక్టులు, వైద్యారోగ్య కుటుంబ సంక్షేమం, విద్యుత్‌, ఇతర సబ్సిడీలకు కేటాయింపులకు తగ్గకుండా నిధులిచ్చింది. 2020-21 బడ్జెట్‌ కరోనా ప్రభావం కంటే ముందు రూపొందించింది. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి రావడం వ్యయాలపై ప్రభావం చూపిందని ఆర్థిక శాఖ విశ్లేషించింది.
మెరుగ్గా నిధులు పొందిన కొన్ని శాఖలు ఇలా...
* రైతుబంధుకు బడ్జెట్‌ ప్రతిపాదనలకంటే రూ.500 కోట్లు అదనంగా విడుదల చేసింది.
* సాగునీటి ప్రాజెక్టుల కోసం నీటిపారుదల శాఖకు నిర్వహణ వ్యయం కాకుండా రూ.7,675 కోట్లు ప్రతిపాదించగా ఫిబ్రవరి నాటికి రూ.6,800 కోట్లు విడుదలయ్యాయి. ఈ మొత్తం కాకుండా బడ్జెట్‌ వెలుపల రుణాల ద్వారా ప్రాజెక్టులకు రూ.8,400 కోట్లను వ్యయం చేశారు.
* ఆసరా పింఛన్లకు రూ.11,758 కోట్లకు గాను సుమారు రూ.10 వేల కోట్లు వ్యయమయ్యాయి.
* విద్యుత్‌ శాఖకు రూ.10,095 కోట్లు ప్రతిపాదించగా అంతకంటే ఎక్కువే వ్యయం కానుంది.
* వైద్యఆరోగ్య శాఖకు ప్రగతి పద్దు కింద రూ.2,361 కోట్లను కేటాయించినా కొవిడ్‌తో ఆ శాఖ వ్యయం భారీగా పెరిగింది.
* కల్యాణలక్ష్మికి రూ.2,240 కోట్లు ప్రతిపాదించగా మార్చికి రూ.1,500 కోట్లు ఖర్చయ్యాయి.
* రుణమాఫీకి బడ్జెట్‌లో రూ.6,225 కోట్లు పెట్టగా రూ.25 వేలలోపు బకాయిలు ఉన్న మూడు లక్షల మందికి రూ.4,080 కోట్లను పరిహారంగా అందించింది.

హైదరాబాద్‌ అభివృద్ధికి పాక్షికంగానే...
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలకు ప్రతినెలా నికరంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తోంది. పల్లెప్రగతి ద్వారా గ్రామ పంచాయతీలకు రూ.308 కోట్లు, పట్టణ ప్రగతి కోసం పట్టణ స్థానిక సంస్థలకు రూ.148 కోట్లను ఇస్తోంది. హైదరాబాద్‌ కార్పొరేషన్‌కు నెలనెలా రూ.77 కోట్లను అందిస్తోంది. ఇదే సమయంలో హైదరాబాద్‌ అభివృద్ధికి ఈ ఏడాది రూ.10 వేల కోట్లను కేటాయించినా నిధులు నామమాత్రంగానే విడుదలయ్యాయి.

పరిమితంగా నిధులు పొందిన విభాగాలు...
* కరోనా కారణంగా విద్య ఆన్‌లైన్‌కే పరిమితమైంది. ఈ శాఖలో వేతనాలను విడుదల చేయగా అభివృద్ధి నిధులు నామమాత్రంగానే ఉన్నాయి.
* రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి రూ.10,500 కోట్లు కేటాయించగా ఇక్కడా అదే పరిస్థితి.
* కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వ్యవసాయంలో రూ.334 కోట్లు వ్యయం చేయాలని అంచనా వేయగా ఈ మొత్తం కూడా అందుబాటులోకి రాలేదు.
* ఎస్సీ, ఎస్టీ, బీసీల స్వయం ఉపాధి పథకాలకు తోడ్పాటు లభించలేదు. అత్యధికంగా ఆర్థికంగా వెనుకబడిన కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు కేటాయించినా విడుదల కాలేదు.
* రహదారులు భవనాల శాఖకు ప్రగతి పద్దు కింద రూ.1,563 కోట్లకు గాను రూ.918 కోట్లను విడుదల చేసింది.

ఇదీ చదవండి: సంక్షేమానికి పెద్దపీట... ఈసారి రెండు లక్షల కోట్ల బడ్జెట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.