ETV Bharat / state

తక్షణం బియ్యం సేకరణ ప్రారంభం.. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడి

తెలంగాణ నుంచి బియ్యం సేకరణను ఆపేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. తక్షణం సేకరణ ప్రారంభించాలని ఎఫ్‌సీఐని ఆదేశించినట్లు వెల్లడించారు.

పీయూష్‌ గోయల్‌
పీయూష్‌ గోయల్‌
author img

By

Published : Jul 21, 2022, 4:53 AM IST

Updated : Jul 21, 2022, 4:59 AM IST

తెలంగాణ నుంచి బియ్యం సేకరణను ఆపేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. తక్షణం సేకరణ ప్రారంభించాలని ఎఫ్‌సీఐని ఆదేశించినట్లు వెల్లడించారు. బియ్యం నిల్వల్లో అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు తీసుకోవాలన్న కేంద్రం సూచనలను పెడచెవిన పెట్టడం, ప్రధానమంత్రి గరీబ్‌కల్యాణ్‌ అన్న యోజన కింద ఏప్రిల్‌, మే నెలల్లో ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయకపోవడం వల్ల గతంలో ఆంక్షలు విధించినట్లు చెప్పారు.

జూన్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీని మొదలుపెట్టడం, అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆంక్షలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.బుధవారమిక్కడ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి గోయల్‌ మాట్లాడారు.

పేదలకు ప్రతినెలా 5 కేజీల ఉచిత బియ్యం పంపిణీని తెలంగాణ ప్రభుత్వం ఏ మాత్రం దయలేకుండా నిలిపేసింది. అందుకే చాలా బాధాతప్త హృదయంతో రాష్ట్రంలో బియ్యం సేకరణ కార్యక్రమాన్ని ఆపేయాలని జూన్‌ 7న ఉత్తర్వులు జారీచేశాం. రాష్ట్రప్రభుత్వ తప్పుడు పనుల వల్ల రైతులకు నష్టం జరగకూడదన్న ఉద్దేశంతోనే తక్షణం బియ్యం సేకరణ ప్రారంభించాలని నిర్ణయించాం.

ఒత్తిడి చేయడంతోనే: పేదలకు తిండిగింజలు పంచకుండా రాష్ట్రం ఆపేయడం ఘోరం. ఇలాంటి అన్యాయం దేశంలో మరే ఇతర రాష్ట్రమూ చేయకూడదని భావించి తెలంగాణ నుంచి బియ్యం సేకరణ ఆపేస్తామని ఒత్తిడి తీసుకొచ్చాం. పేదల హక్కులను లాక్కొనే ఇలాంటి ఘోరమైన అన్యాయాన్ని ఏ ప్రభుత్వమూ చేయకూడదు. ఆపేసిన ఈ పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని పదేపదే రాష్ట్ర మంత్రులు, అధికారులకు విజ్ఞప్తిచేసినా వాళ్లు పట్టించుకోలేదు.

బియ్యం నిల్వలు సరిగా నిర్వహించడంలేదని, ఉన్నదాంట్లో కల్తీ కూడా చేశారని రాష్ట్రంలో ఆడిట్‌ చేసినప్పుడు తేలింది. మిల్లర్లు కొన్ని తప్పుడు లెక్కలుకూడా ప్రకటించారు. వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినా వినిపించుకోలేదు. పేదలకు తిండిగింజలు ఇవ్వకుండా మాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాలను బంద్‌ చేయడానికే వెంటపడాల్సి వచ్చింది.

నూకలు తినిపించాలని నేను అనలేదు: రబీ సమయంలో నూకలు వస్తే వాటిని తెలంగాణ ప్రజలతోనే తినిపించాలని నేను అన్నట్లు ఆ రాష్ట్ర మంత్రులు చేసిన వ్యాఖ్యల్లో నిజంలేదు. ఎవ్వరూ వారి మాటలను నమ్మొద్దు. పత్రికల్లో వారి వ్యాఖ్యలు, ప్రకటనలు చూశాక ఎంతో ఆందోళనకు గురయ్యా. అలాంటివారితో సమావేశం కావడం కూడా మంచిది కాదేమో అనిపిస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని పేదలు, రైతుల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని ఆశిస్తున్నా. జూన్‌లో మేం బియ్యం సేకరణ ఆపేయడంతో వాళ్లు పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేయడం ప్రారంభించారు. జులై కోటా త్వరలో పంపిణీచేస్తామని చెప్పారు. కేంద్రం నుంచి తీసుకొని పేదలకివ్వని ఏప్రిల్‌, మే నెలల కోటానూ పంపిణీచేయాలని చెప్పాం.

* ఇథనాల్‌ డిస్టిలరీల ఏర్పాటు కోసం ఎన్నో దరఖాస్తులు వస్తున్నా తెలంగాణ ప్రభుత్వం అనుమతివ్వడంలేదు. రాష్ట్రానికి 36 కోట్ల లీటర్ల ఇథనాల్‌ కావాల్సి ఉన్నా వారు దరఖాస్తులను పట్టించుకోవడంలేదు. డిస్టిలరీలు వస్తే పెద్దఎత్తున పెట్టుబడులతోపాటు యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఈ దరఖాస్తులపైచర్యలు తీసుకోవాలనికోరుతున్నా.

* తెలంగాణలో వడ్ల సేకరణలో ఏవైనా అవకతవకలు జరుగుతుంటే మేం కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. తక్షణం ఆడిట్‌ టీంలను పంపి విచారణ చేయిస్తాం. అక్కడ ఏమైనా తప్పులు జరుగుతున్నట్లు తేలితే దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తాం. ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి’’ అని పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి పేదలకంటే రాజకీయాలపైనే ఎక్కువ ఆసక్తి: తెలంగాణ ప్రభుత్వం పేదలకు సేవచేయడంకంటే రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి చూపడం వల్లే పదేపదే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి మేం ప్రయత్నిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం అందుకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది.

"ముఖ్యమంత్రి, ఆయన సహచరులు ప్రధానమంత్రి, కేబినెట్‌ మంత్రులపై అన్‌పార్లమెంటరీ భాష ప్రయోగించడం చాలా దురదృష్టకరం. ఉచిత బియ్యం పంపిణీచేయాలని ఒత్తిడిచేయాల్సి రావడాన్ని బట్టి అక్కడ ఎలాంటి ప్రభుత్వం నడుస్తోందన్నది తెలుస్తోంది. అక్కడ పూర్తి విఫల ప్రభుత్వం నడుస్తోంది." - పీయూష్‌ గోయల్‌ కేంద్ర మంత్రి

ఇవీ చదవండి: Student Suicide: ఆరో తరగతి విద్యార్థిని సూసైడ్.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు

గాల్లో ఉండగా పగిలిన విమాన అద్దం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

Last Updated : Jul 21, 2022, 4:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.