ఉత్తర బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండురోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బుధవారం ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గురువారం చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వివరించారు. ఉత్తర-దక్షిణ ద్రోణి.. రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం కేంద్రీకతమై ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇదీ చూడండి: కొవిడ్ విలయం: కొత్తగా 60,975 కేసులు, 848 మరణాలు