నైరుతి రుతుపవనాలు ఇవాళ ఉదయమే కేరళ తీరాన్ని తాకాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జూన్ 15 లోగా రుతుపవనాలు పూర్తిగా విస్తరించనున్నాయని వాతావరణశాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కారణం నైరుతి రుతుపవనాలు కాదని... ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్లేనని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మధ్య భారతదేశంలో సాధారణ వర్షాపాతం నమోదవుతుందంటున్న వాతావరణ శాఖ అధికారిణి శ్రావణితో ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
ఇవీ చూడండి: గంప గుత్తగా జడ్పీ పీఠాలను దక్కించుకున్న తెరాస