కరోనా మహమ్మారిపై ముందుండి చేస్తున్న పోరాటంలో ఎందరో వైద్యులు కొవిడ్ బారిన పడ్డారని ఐఎంఏ, తెలంగాణ పీడియాట్రిక్ వైద్యుల సంఘం ప్రతినిధులు పేర్కొనారు. విధి నిర్వహణలో కరోనా బారిన పడిన వైద్యులు, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్ ఆస్పత్రిలో 30 పడకలు, వెంటిలేటర్లతో కూడిన ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని కోరుతూ.. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఐఎంఏ, పీడియాట్రిక్ అకాడమీ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులు డా.గార్లపాటి లక్ష్మణ్, డా. ఎ.యశ్వంత్‌రావు, డా.సీఎన్ రెడ్డి, డా.భాస్కర్, డా.విజేందర్ రెడ్డి, డా.శ్యాంసుందర్ మంత్రి ఈటలతో సమావేశమయ్యారు. వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వ సారథ్యంలో వైద్యులు కరోనా వైరస్‌తో విశేషంగా పోరాడుతున్నారని తెలిపారు. వైద్యులు, వారి కుటుంబ సభ్యుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం నిమ్స్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: 'కరోనాపై పోరులో అన్ని రాష్ట్రాలకు దిల్లీనే ఆదర్శం'