ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి చెందిన టీపీ డ్యాం వద్ద నలుగురు యువకులు ఈతకు దిగి వరద ఉద్ధృతిలో చిక్కుకుపోయారు. ఒనకఢిల్లీ ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు శుక్రవారం టీపీ డ్యాంలో ఈతకు దిగారు. మధ్యాహ్నం రెండు గంటలకు విద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తి జనరేటర్లన్నీ ఆగిపోయాయి. టీపీ డ్యాం వద్ద వరద ఉద్ధృతి పెరిగింది. దాదాపు 6 గంటల పాటు యువకులు ఒక రాయిపై నిలబడి ప్రాణాలను కాపాడుకున్నారు. ఎట్టకేలకు ఒనకఢిల్లీ గ్రామానికి చెందిన కొంత మంది స్థానికులు సాహసించి తాళ్ల ద్వారా నలుగురు యువకులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. భారీ వర్షం కురవడం వల్ల ఆ ప్రాంతం మొత్తం విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సమాచార వ్యవస్థ స్తంభించిపోయింది.
ఇదీ చదవండీ:బతుకు 'ఛత్రం' - కూటి కోసం కోటి తిప్పలు