ETV Bharat / state

రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి.. రూ.700 కోట్లతో జంతు వ్యాక్సిన్​ తయారీ కేంద్రం..

రాష్ట్రంలో ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. హైదరాబాద్​లో రూ.700 కోట్ల పెట్టుబడితో జంతువుల వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్​తో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ జోరు కొనసాగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.

IIL company investments in Telangana
IIL company investments in Telangana
author img

By

Published : Oct 10, 2022, 8:34 PM IST

రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో రూ.700 కోట్లతో జంతు వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ సంస్థ (ఐఐఎల్) ప్రకటించింది. పాదాలు, నోటి ద్వారా పశవులకు సంక్రమించే వ్యాధులు, ఇతర వ్యాధులకు సంబంధించిన టీకాల ఉత్పత్తి కోసం కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ తెలిపింది.

పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​తో సమావేశమైన ఐఐఎల్ ఎండీ ఆనంద్ కుమార్, ప్రతినిధులు తమ సంస్థ విస్తరణ ప్రణాళికలు వివరించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఈ కేంద్రంతో 750 మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. వెటర్నరీ వ్యాక్సిన్ ఫెసిలిటీ ఏర్పాటుకు జీనోమ్ వ్యాలీలో సంస్థ పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పారు. అత్యాధునిక సౌకర్యాలతో బయో సేఫ్టీ లెవల్ 3 ప్రమాణాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్
సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్

గచ్చిబౌలిలో ప్రస్తుతం ఉన్న తయారీ కేంద్రం సంవత్సరానికి 300 మిలియన్ డోస్​ల సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఈ వ్యాక్సిన్ తయారీ కేంద్రంతో ఇప్పటికే సంస్థకు ఉన్న సామర్థ్యానికి అదనంగా సంవత్సరానికి మరో 300 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుందని వివరించారు. ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ సంస్థ జీనోమ్ వ్యాలీలో మరో వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

కొత్త టీకా ఉత్పత్తి కేంద్రంతో ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ జోరు కొనసాగుతుందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్​లో ఐఐఎల్ ఏర్పాటు చేయనున్న మూడో టీకా తయారీ కేంద్రం వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారతదేశ స్వయం సమృద్ధికి నిదర్శనమని సంస్థ ఎండీ ఆనంద్ కుమార్ తెలిపారు. తమ వ్యాక్సిన్​తో పశువులకు వచ్చే తీవ్రమైన వ్యాధులు తగ్గడంతో పాటు రైతులు.. దేశానికి రూ.వేల కోట్లు ఆదా అవుతాయని ఎండీ ఆనంద్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి: ఆ ప్రచారంతోనే ప్రజల్లోకి వెళ్లాలి: పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం

శివసేన వర్గాలకు కొత్త పేర్లు.. ఠాక్రే పార్టీకి 'కాగడా' గుర్తు.. ఈసీ నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.