ETV Bharat / state

ప్రజలందరికీ మెరుగైన ఉచిత వైద్యం - ఆరోగ్యశ్రీ

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ఒకే ఆరోగ్య పథకం కిందకు చేర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం కొత్తగా సార్వజనీన ఆరోగ్య సంరక్షణ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది.

అందరికీ ఉచిత వైద్యం
author img

By

Published : Jul 10, 2019, 8:06 AM IST

Updated : Jul 10, 2019, 8:13 AM IST

రాష్ట్రంలో కొత్తగా సార్వజనీన ఆరోగ్య సంరక్షణ పథకాన్ని(యూనివర్సల్‌ హెల్త్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌) అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే వేర్వేరు ఆరోగ్య పథకాల కింద దాదాపు కోటి కుటుంబాలకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చి ఏకగవాక్ష విధానంలో అమలు చేయడంపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం దృష్టిపెట్టింది. తద్వారా ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించడానికి మార్గం సులభమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

అనేక రూపాల్లో నిధుల వ్యయం

రాష్ట్రంలో ప్రస్తుతం ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, పాత్రికేయుల ఆరోగ్య పథకాలు, ఆరోగ్య భద్రత, ఆర్టీసీ, సింగరేణి, ఈఎస్‌ఐల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా వైద్యసేవలకయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తోంది. అదనంగా ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల కోసం ఏటా పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.2 వేల కోట్ల వరకు ప్రభుత్వ నిధులు ఖర్చవుతున్నా.. వైద్య సేవల్లో లోటుపాట్లు ఎదురవుతూనే ఉన్నాయి.

ఆరోగ్యశ్రీ మినహా మిగిలిన ఏ పథకం అమల్లోనూ ఆన్‌లైన్‌ సమాచారం పొందుపర్చడం లేదు. ఆయా జిల్లాల్లో ఎటువంటి వ్యాధులు ప్రబలుతున్నాయో, వారికి అందుతున్న వైద్య సేవలు ఏలాంటివో అనే సమాచారమేదీ అందుబాటులో లేదు. ఈ దృష్ట్యా వైద్యారోగ్యశాఖ కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు తెలిసింది. ఏ పథకం కింద ఎన్ని కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి? వాటికి ఏటా అయ్యే ఖర్చు ఎంత? వాటన్నింటినీ ఒకే గూటికి తేవడం ద్వారా ఏవిధంగా మెరుగైన వైద్యసేవలు అందించవచ్చు?’’ తదితర అంశాలతో కూడిన సమాచారాన్ని ప్రతిపాదనల్లో పొందుపర్చినట్టు సమాచారం.

వందశాతం ప్రజలకు ఉచిత వైద్యం

ఇదే విషయంపై ఇటీవల వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఉన్నతాధికారులతో చర్చించారు. ‘‘వేర్వేరు పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా వంద శాతం ప్రజలకు ఉచిత వైద్యం అందించవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సీఎం కేసీఆర్‌తో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నామని వైద్య వర్గాలు తెలిపాయి. ఆయుష్మాన్‌ భారత్‌లో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలపైనా ఈ సందర్భంగా చర్చించినట్టు తెలిసింది.

ఆ పథకం నిబంధనల ప్రకారం రాష్ట్రంలో సుమారు రూ.20 లక్షల కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరే అవకాశాలున్నాయన్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ కింద 77 లక్షల కుటుంబాలకు వైద్యసేవలందిస్తున్నామని ఉన్నతాధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయుష్మాన్‌ భారత్‌లో చేరడం వల్ల రాష్ట్రంలోని 20 లక్షల కుటుంబాల మేరకైనా నిధులు వచ్చే అవకాశాలున్నాయనే అంశంపై చర్చ జరిగింది. సీఎం దృష్టికి తీసుకెళ్లాకనే ఈ అంశంపై ముందుకెళ్లాలనే నిర్ణయానికొచ్చామని వైద్య వర్గాలు వెల్లడించాయి.

సొంతంగా ఖర్చు చేసే వారికి కూడా వర్తింపు

తెలంగాణలో సుమారు కోటి కుటుంబాలున్నాయనేది అంచనా. ప్రభుత్వ ఆరోగ్య పథకాల పరిధిలోకి రాకుండా స్వచ్ఛందంగా బీమా సంస్థల ద్వారా లేదా సొంతంగా వైద్య సేవల కోసం ఖర్చుపెట్టుకునే కుటుంబాలు సుమారు లక్ష వరకూ ఉండొచ్చని అంచనా. వీరిని కూడా సార్వజనీన ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ పథకం పరిధిలోకి తీసుకురావడం ద్వారా రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత వైద్యసేవలందించినట్లు అవుతుందనేది ప్రతిపాదనల్లో ప్రధాన అంశం.

ఇవీ చూడండి : బల్కంపేట ఎల్లమ్మ సన్నిధిలో తాగుబోతుల హంగామా

TG_NLG_62_09_VARSHAMKOSAM_POOJALU_AV_TS10061 రిపోర్టర్ - సతీష్ శ్రీపాద సెంటర్ - భువనగిరి జిల్లా - యాదాద్రి భువనగిరి సెల్ - 8096621425 యాంకర్ : వర్షాలు సంవృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బాలంపల్లి గ్రామంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఊరి మధ్యలో నీటి బిందెల చుట్టూ మహిళలు ప్రదక్షిణలు చేస్తూ బతుకమ్మ ఆడారు.
Last Updated : Jul 10, 2019, 8:13 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.