హైదరాబాద్లో దిగిన తర్వాత ఘనస్వాగతం పలికిన ప్రజలు, పార్టీ శ్రేణులకు... కేంద్రమంత్రి అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. జనసందోహాన్ని చూస్తుంటే గ్రేటర్ పీఠం భాజపాదేనని షా స్పష్టం చేశారు.
ఎందుకు రాలేదు...
వరదలు వచ్చి నగర ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కేసీఆర్, ఓవైసీ ఎందుకు రాలేదని అమిత్షా ప్రశ్నించారు. ఒక్కసారి భాజపాకు అవకాశం ఇస్తే మంచి పరిపాలన అందిస్తామని వాగ్ధానం చేశారు. కేసీఆర్ బయటకు వచ్చి చూస్తే ప్రజల కష్టాలు ఏంటో తెలుస్తాయని పేర్కొన్నారు.
ప్రధానికి పేరు వస్తుందని...
రాజకీయ కారణాలతో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయటం లేదని అమిత్షా ఆరోపించారు. ప్రధాని మోదీకి పేరు వస్తుందని కేసీఆర్ అమలు చేయడం లేదని విమర్శించారు.
రహస్య ఒప్పందాలు..
ఈ సందర్భంగా తెరాస, మజ్లిస్ కుటుంబ రాజకీయాలపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవచ్చని... కానీ రహస్య ఒప్పందాలు ఎందుకని తెరాసను ఉద్దేశించి అమిత్ షా ఆరోపణలు చేశారు.
ఇదీ చూడండి: 'కేసీఆర్ సచివాలయానికి వెళ్తే... మేం ఏమిచ్చామో తెలుస్తది'